Rajadhani Files : ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్…జగన్ కు రిటర్న్ గిఫ్ట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌లు (Andhra Pradesh Elections) ద‌గ్గర‌ప‌డుతున్న నేప‌థ్యంలో పొలిటిక‌ల్ సినిమాలు ఎక్కువ‌య్యాయి. ఇప్పటికే యాత్ర 2(Yatra 2), వ్యూహం సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అయితే ఆర్జీవీ, జగన్ వ్యూహానికి లోకేష్ చెక్ పెట్టడం తో అది కోర్టులో విడుదలకు ఎదురుచూస్తున్న ఖైదీల మాదిరి బయటకు రావడానికి కష్టపడుతుంది. ఇక యాత్ర 2 తోనే తానూ అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తున్న జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది రాజధాని ఫైల్స్ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్ ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేసింది.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. రాజధాని (Rajdhani ) కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రాజధాని ఫైల్స్'(Rajdhani Files). తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ విషయానికి వస్తే… ఏపీ రాజధాని అమరావతి ఇష్యూ కథాంశంగా సినిమా రాబోతోంది.అమరావతి అంశంపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. జగన్ అధికారం కోసం చేసిన ప్రయత్నం యాత్ర 2 అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులకు చేసిన అన్యాయమే రాజధాని ఫైల్స్ అనేలా సినిమాలు రూపొందాయి. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధాని పట్ల చేసిన హామీలు ఏమిటి.? అధికారంలోకి వచ్చాక చేసిన ప్రకటనలు ఏమిటి.? అనేదాని కేంద్రంగా మూవీ చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఎటువంటి ప్రమోషన్స్, హడావుడి లేకుండా మూవీ మేకర్స్ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమా పై ప్రజలలో ఆసక్తి, వైసీపీ నాయకులలో టెన్షన్ మొదలయ్యాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ తో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే తమ రాష్ట్రానికి రాజధాని లేదని.. దేశంలో తమ అస్తిత్వం కు సరైన గుర్తింపు లేకుండా పోతుందని.., పక్క రాష్ట్రాల వారి ముందు రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా మిగిలిపోయాం అనే భాద, ఎమోషన్, నిరుత్సహంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఫైల్స్ తో అమరావతి విషయంలో వైసీపీ (YCP) ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని చూపించనున్నారు. అమరావతి కాదు ‘కమ్మ’రావతి అంటూ రాజధానిని కూల్చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి లో జరిగిన విధ్వంసమే మూల కథగా తెరకెక్కుతున్న రాజధాని ఫైల్స్ మూవీ ని ఏపీలో విడుదల చేయనిస్తుందా.. అన్న అనుమానాలు లేకపోలేదు. ఎన్నికలకు ముందే రాజధాని ఫైల్స్ ప్రజల ముందుకు వస్తే, ఆ సినిమాను ప్రజలు నెత్తినపెట్టుకుంటే మాత్రం ఇన్నాళ్ళుగా ముఖ్యమంత్రిగా నెత్తిన పెట్టుకున్న జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపడానికి మేము కూడా “సిద్ధం” అని ఏపీ ప్రజలు సంకేతం ఇచ్చినట్టుగానే భావించాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.