Ministers defeat : నోటి దూల తీరిందా ? జనం భలే షాకిచ్చారు !

జగన్ మంత్రి వర్గంలోని మంత్రులు తమకి ఇచ్చిన శాఖలపై రివ్యూలు... ఆ శాఖ పనితీరు గురించి మాట్లాడటం కాకుండా... ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిడుతుండేవారు.

జగన్ మంత్రి వర్గంలోని మంత్రులు తమకి ఇచ్చిన శాఖలపై రివ్యూలు… ఆ శాఖ పనితీరు గురించి మాట్లాడటం కాకుండా… ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిడుతుండేవారు. ఆ నోటి దూల ఎంతదాకా వెళ్ళిందంటే… చంద్రబాబు, పవన్ కల్యాణ్ భార్యలు, కుటుంబసభ్యులను కూడా ఈ గొడవల్లోకి లాగుతూ… నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు. గతంలో రాజకీయం అంటే కాస్తంత హుందాతనం ఉండేది. కానీ ఈసారి ఏపీ రాజకీయాలను చూస్తే జనానికి రోత పుట్టింది. ఆ బూతులు వినలేక ఛానెల్స్ మార్చేసుకున్నారు చాలామంది. అలాంటి నోటి దూల మంత్రులు, నేతలను చావు దెబ్బ తీశారు ఆంధ్రప్రదేశ్ జనం. జగన్ కేబినెట్ లో ఏకంగా 20 మంది మంత్రులను ఇంటికి పంపేశారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే సైకిల్ గాలిలో కొట్టుకుపోకుండా నిలదొక్కుకున్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్… ఆఖరికి పాలిటిక్స్ సంబంధం లేని చిరంజీవిని కూడా తిట్టిపోసింది రోజా. అలాంటి రోజాను నగరి జనం ఇంటికి సాగనంపారు. అందుకే రోజా ఓటమిపై బండ్ల గణేష్ ఫస్ట్ రియాక్షన్ కూడా ఇచ్చారు. ఇక జబర్దస్త్ పిలుస్తోంది … వెళ్ళమని కామెంట్ చేశారు. ఇంకా విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలను టచ్ చేస్తూ బండబూతులు తిట్టే గుడివాడ అమర్ నాథ్, అంబటి రాంబాబు లాంటి మంత్రులు ఓడిపోయారు. వీళ్ళే కాకుండా ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్ససత్యనారాక్ష్న, పీడిక రాజన్న దొర, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల్, కొట్ట సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజనీ, కాకాణి, ఉష శ్రీచరణ్ లాంటి మంత్రులంతా ఓడిపోయారు.

ఇదే నోటిదూల ప్రదర్శించిన గుడివాడ కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ ని కూడా జనం ఇంటికి పంపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విద్వేషం కూడా మంత్రులు, ఇతర కీలక నేతల ఓటమికి కారణమైందని అంటున్నారు. పవన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా… వ్యక్తిగతంగా దాడి చేస్తూ విరుచుకుపడేవారు. మూడు పెళ్ళిళ్ళు, దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ పై విమర్శలు చేసే వారు. రాజకీయ విమర్శలు కాకుండా ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే జనం మంత్రులను ఈసడించుకున్నారు.
వైసీపీపై జనంలో ఉన్న వ్యతిరేకతతో పాటు మంత్రులపై అవినీతి ఆరోపణలు కూడా వాళ్ళ ఓటమికి కారణాలయ్యాయి. జగన్ బటన్ నొక్కుతూ డబ్బులు పంచడం తప్ప… రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం… పదేళ్ళయినా కనీసం రాజధాని నగరం నిర్మించుకోలేని దౌర్భాగ్యంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ జనం మంత్రులందర్నీ తమ ఓటు ద్వారా ఈడ్చి కొట్టారు.