RGV SURVEY PKG : ఏపీ ఎన్నికలపై ఆర్జీవీ సర్వే.. వైసీపీకి ఎన్ని సీట్లు ఇచ్చాడంటే…

మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ఫలితాలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై నేషనల్, రీజినల్ సర్వేలు రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ (Exit polls) బయటపెట్టాయి.

మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ఫలితాలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై నేషనల్, రీజినల్ సర్వేలు రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ (Exit polls) బయటపెట్టాయి. కొన్ని సర్వేలు వైసీపీ (YCP) కి అనుకూలంగా… మరికొన్ని టీడీపీ కూటమి (TDP alliance) అధికారం చేపడుతుందని అంచనాలు వేశాయి. దాంతో ఏపీలో నాయకులతో పాటు జనంలో టెన్షన్ పీక్స్ కు చేరింది. ఈ టైమ్ లో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Verma) కూడా ఏపీ ఫలితాలపై ఓ సర్వే రిలీజ్ చేశాడు. పైగా అది 100 శాతం కచ్చితత్వం ఉన్న సర్వే అంటున్నాడు. డైరెక్టర్ ఆర్జీవీ చేసిన ఆ సర్వే ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సిరాశ్రీ (Sirashree) అనే ట్విట్టర్ యూజర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై తన ఎగ్జిట్ పోల్’ ఇది అంటూ ఓ ట్వీట్ పెట్టారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు అంటూ వేర్వేరుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను అతను రిలీజ్ చేశాడు. వైసీపీ, కూటమిల్లో ఏదైనా 0 నుంచి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవవచ్చని.. అలాగే లోక్ సభ సీట్లల్లో వైసీపీ, టీడీపీ కూటమిల్లో ఎవరైనా… సున్నా నుంచి 25 స్థానాల మధ్య గెలవొచ్చంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఏ సర్వే అయినా అంచనా తప్పు కావొచ్చు. కానీ.. నా అంచనా మాత్రం వందశాతం కరెక్ట్ అవుతాయంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు ట్విట్టర్ యూజర్. ఇదే ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఇదే అత్యంత కచ్చితమైన, వంద శాతం నమ్మే సర్వే అంటూ మెస్సేజ్ చేశాడు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏపీలో వైసీపీకి మద్దతు ఇస్తున్న ఆర్జీవీ కొన్ని సినిమాలు కూడా తీశాడు. ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు ఆయన పెట్టిన ట్వీట్ ని ఆసక్తిగా చూస్తున్నారు జనం.