Nagari MLA, Roja : నగరిలో రోజాకు ఎదురుగాలి.. ఈసారి వైసీపీ టిక్కెట్ ఇస్తారా ?

ఆంధ్రప్రదేశ్ లోని నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే(Nagari MLA), రాష్ట్ర మంత్రి రోజాకు (Roja) ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరిలో ఆమెకు వర్గ పోరు తీవ్రంగా ఉంది. ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాల ఇంఛార్జులు, ముఖ్యనేతలు రోజాకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వర్గాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddi Reddy Ramachandra Reddy) సపోర్ట్ కూడా ఉండటం.. ఆమె సీటుకు ఎసరు పెట్టేలా ఉంది.

ఒకప్పుడు టీడీపీ (TDP) కి కంచుకోటగా ఉన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించినప్పటికీ.. ఈసారి గెలుపు అంశం కంటే.. అసలు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నదానిపై ఎక్కువ చర్చ నడుస్తోంది. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు రోజాకు టిక్కెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారట. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతలు అధిష్టానం దగ్గర గట్టిగానే పోరాడుతున్నారు. మండల స్థాయి నేతలు, జడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్నవారితోనూ రోజాకు పడటం లేదు. దీనికి తోడు రోజా వ్యతిరేక వర్గాల నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉందని చెబుతున్నారు. ఆయన కూడా రోజాకు టిక్కెట్ ఇవ్వొద్దని జగన్ కు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి చెప్పినట్టే నడుస్తోంది. కానీ రోజా మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు.

తమిళనాడుకు బోర్డర్ లో ఉన్న నగరిలో తమిళుల ఓట్లు కూడా ఉన్నాయి. రోజా భర్త, డైరెక్టర్ (Director) సెల్వమణి (Selvamani) తమిళుడు కావడంతో ఆ ఓటు బ్యాంక్ ఆమెకు కలిసొచ్చింది. కానీ రోజా ఈమధ్య సూపర్ స్టార్ రజనీ కాంత్ పై కామెంట్స్ చేయడంతో తమిళులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా రజనీ కాంత్ ను రోజా విమర్శించారు. దాంతో ఐదు మండలాలకు చెందిన తమిళులంతా సమావేశమై.. రోజాకు టిక్కెట్ ఇస్తే గెలిపించబోమని తీర్మానం చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్నందున ఈసారి నగరి టిక్కెట్ రోజాకు ఇవ్వడం కష్టమే అంటున్నారు. కానీ రోజా ఓ సెలబ్రిటీ.. నిత్యం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను తిట్టిపోస్తుంది. ఆమె తిట్టినంతగా ఏపీలో ప్రత్యర్థి పార్టీల నేతలను మరే నాయకుడూ తిట్టలేదు. అలాంటి రోజాను జగన్ వదులుకుంటారా ? ఆమెకు టిక్కెట్ ఇవ్వకుండా ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ నగరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల వ్యతిరేకత నుంచి రోజా ఎలా బయటపడతారు.. వాళ్ళందర్నీ జగన్ ఎలా బుజ్జగిస్తారన్నది చూడాలి.