Rushikonda Palace: ఎంత పనిచేశావ్ గంటా…! బాబు, పవన్ ప్లాన్ దెబ్బ తీశాడుగా !

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ పై టీడీపీ ప్రభుత్వం ప్లాన్ బూమరాంగ్ అయింది. గంటా శ్రీనివాసరావు అత్యుత్సాహంతో ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. వైసీపీని ఇబ్బంది పెట్టాలనుకుంటే... అది టీడీపీకే దెబ్బతగిలింది.

  • Written By:
  • Updated On - June 18, 2024 / 01:46 PM IST

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ పై టీడీపీ ప్రభుత్వం ప్లాన్ బూమరాంగ్ అయింది. గంటా శ్రీనివాసరావు అత్యుత్సాహంతో ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. వైసీపీని ఇబ్బంది పెట్టాలనుకుంటే… అది టీడీపీకే దెబ్బతగిలింది. టీడీపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఈమధ్యే రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. మందీ మార్భలంతో పాటు మీడియాను వెంటబెట్టుకొని ఆ విలాసవంతమైన భూమిని జనానికి చూపించారు. 500 కోట్ల రూపాయలతో జగన్ ముచ్చటపడి కట్టించుకున్నాడు ఈ మహారాజా ప్యాలెస్ ని. రెండోసారి గెలిస్తే అక్కడే మకాం పెట్టాలని అనుకున్నాడు. ఈ ప్యాలస్ లో కేవలం సోకుల కోసమే 120 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. ఇందులో కట్టించిన బాత్ టబ్ 26 లక్షల రూపాయలు ఉంటుంది. ఒక్క కమోడ్ ఖర్చు 12 లక్షలు… దాంతో ఆరుగురు పేదలకు ఇళ్ళు కట్టించవచ్చట. రాష్ట్రపతి, ప్రధాని లాంటి లీడర్లు వస్తే ఉండటానికి బిల్డింగ్ కడితే తప్పేంటని వైసీపీ లీడర్లు సమర్థించుకుంటున్నారు. ఇది పేరుకే ప్రభుత్వ భవనం… మరి ఇందులో మసాజ్ సెంటర్లు ఏంటిరా అని నెటిజెన్లు ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు. జగన్ రెండో సారి సీఎం అయ్యాక… తన కుటుంబ సభ్యులతో కలసి విలాసవంతమైన జీవితం గడపడానికి పక్కా ప్లాన్ తో కట్టుకున్నట్టు ఏపీ జనానికి క్లియర్ గా అర్థమైంది.
రుషికొండ ప్యాలెస్ ను జనానికి చూపించి… ఓ రకంగా గంటా మంచిపనే చేశారు. కానీ పార్టీ అధిష్టానం… CMO అధికారులు మాత్రం ఆయనపై మండిపడ్డారట. అసలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి వెళ్ళి ఈ ప్యాలెస్ తాళాలు ఓపెన్ చేయిద్దామని అనుకున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, పార్టీ నాయకులు, మీడియాతో కలసి వీళ్ళిద్దరూ ఆ రాజ మహల్ ను సందర్శించాలని ప్లాన్ చేశారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి… ప్రజాధనాన్ని జగన్ ఎంత దుర్వినియోగం చేశాడో లెక్కలతో సహా వివరించాలని అనుకున్నారు. కానీ గంటా శ్రీనివాస్ పార్టీ సీనియర్లకు తెలియకుండా… హడావిడిగా వెళ్ళి ఓపెన్ చేయడంపై చంద్రబాబు మండిపడినట్టు తెలిసింది. దీనిపై గంటాను వివరణ కోరినట్టు సమాచారం. ఇకపై ఆ ప్యాలెస్ లోకి ఎవరూ వెళ్ళకుండా అధికారులు తాళాలు వేశారు. రుషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలో ఇంకా డిసైడ్ చేసుకోకుండానే గంటా హడావిడి చేయడంపై కూటమి పెద్దలు కూడా గరం గరంగా ఉన్నారు.