BABU GELUPU : సహనం… ఓర్పు.. చంద్రబాబు ఆయుధాలు ఇవే

సహనం... ఓర్పు... ఎప్పటికైనా రాజును చేస్తాయి అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో అదే జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక... ఐదేళ్ళ యేళ్ళ పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్ అరాచకాలను ఎంతో సహనంగా భరించారు బాబు.

 

 

సహనం… ఓర్పు… ఎప్పటికైనా రాజును చేస్తాయి అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో అదే జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక… ఐదేళ్ళ యేళ్ళ పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్ అరాచకాలను ఎంతో సహనంగా భరించారు బాబు. అంతేకాదు… వైసీపీ దారుణ ఓటమికి ఈ ఐదేళ్ళూ వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. సహనం, వ్యూహం అనే రెండు ఆయుధాలతో జగన్ ను కోలుకోలేని దెబ్బతీశారు చంద్రబాబు. గతంలో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ గెలుచుకున్నారు చంద్రబాబు. అధికార వైసీపీ మరీ ఇంతదారుణంగా ఓడిపోతుందని జగనే కాదు… ఎవరూ ఊహించలేదు.

ఏపీ పాలిటిక్స్ ని రెండు విధాలుగా చూడొచ్చు. చంద్రబాబు అరెస్ట్ కు ముందు… తర్వాత అని. చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టిన జగన్… ఊహించని విధంగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వాటిని ముందుకు తెచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబును అరెస్ట్ చేయించడమే కాకుండా… లోకేశ్, ఇతర టీడీపీ నేతలపైనా అనేక కేసులు మోపింది జగన్ ప్రభుత్వం. చంద్రబాబు అంతకుముందు నాలుగేళ్ళుగా సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకొని పోరాడారు. అసెంబ్లీలో తన భార్యను అవమానించారంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జైలుకు వెళ్ళి రావడం… అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు తెలపడం… ఆ తర్వాత పవన్ ని తక్కువ సీట్లు అయినా బలమైనవి ఇవ్వడం… బీజేపీతో దోస్తీ… ఇవన్నీ కూడా చంద్రబాబు వ్యూహంలో భాగాలే.

బీజేపీతో పొత్తువల్ల మైనార్టీలకు దూరం అవుతామని పార్టీ సీనియర్లు హెచ్చరించారు. కానీ అసలు ఏపీలో సక్రమంగా ఎన్నికలు జరగాలంటే కేంద్రం నుంచి బీజేపీ అండ ఉండాలని ఆ పార్టీతో పొత్తు కోసం పట్టుబట్టారు బాబు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా… ఎండల్లోనే ఏపీ అంతటా చుట్టొచ్చారు. లోకేశ్ ని ఎక్కువ హైలెట్ చేయకుండా మంగళగిరికి పరిమితం చేశారు. అదే టైమ్ లో యూత్ లో యమ క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ ను వెంటబెట్టుకొని తిరుగుతూ.. టీడీపీ, జనసేన మధ్య ఉన్న అపోహలకు చెక్ పెట్టారు. ఇంత జరుగుతున్నా… కూటమిలో 3 పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ ఫర్ అవుతాయా.. లేదా అన్న అనుమానాలు ఎక్కడో ఉన్నాయి. అయినా టీడీపీ, జనసేన పార్టీల నాయకులు…

కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల్లో కలసి పనిచేశారు. అందుకోసమే పవన్ తో అనేక సమావేశాల్లో పాల్గొని ఇద్దరం ఒక్కటే అనే భావాన్ని జనంలోకి తీసుకెళ్ళారు చంద్రబాబు. జగన్ ని ఎలాగైనా ఇంటికి పంపాలన్న పట్టదల చంద్రబాబులో కసిని పెంచింది. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కింది. ఏం చేసినా సీఎం కావడమే చంద్రబాబు లక్ష్యం. సహనంతో వ్యూహంతో నాలుగో సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు నారా చంద్రబాబునాయుడు.