Sarath Chandra Reddy : నెల్లూరు ఎంపీగా శరత్‌ చంద్రారెడ్డి?

రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) సామ దాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నారు. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది తెలిసిన ప్రతీ నాయకున్ని సెకండ్‌ ఒపీనియన్‌ లేకుండా మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) కంచుకోట నెల్లూరులో కూడా భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ కీలక నేతగా నెల్లూరు అర్బన్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు.

 

రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) సామ దాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నారు. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది తెలిసిన ప్రతీ నాయకున్ని సెకండ్‌ ఒపీనియన్‌ లేకుండా మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) కంచుకోట నెల్లూరులో కూడా భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ కీలక నేతగా నెల్లూరు అర్బన్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారు జగన్‌. దీంతో ఇక్కడ ఎంపీ సీట్‌ ఖాళీ అయ్యింది. ఆ స్థానం నుంచి విజయ్‌సాయి రెడ్డి అల్లుడు శరత్‌ చంద్రారెడ్డిని బరిలో దింపాలని సీఎం జగన్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మొదట ఆ స్థానం నుంచి రాజ్యసభ (Rajya Sabha) ఎంపీగావున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని (Vemireddy Prabhakar Reddy) పోటీ చేయించాలని జగన్ అనుకున్నారు. ఆయన్ను పోటీ చేయించేందుకు అంతా సిద్ధమవుతున్న సమయంలో వేమిరెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానల్లో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టారు. నెల్లూరు సిటీ టికెట్ తన భార్యకు.. కందుకూరు టికెట్ తన అనుచరుడికి ఇవ్వాలనని వైసీపీ హైకమాండ్‌ను వేమిరెడ్డి కోరారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎంపీ స్థానంలో మరో వ్యక్తిని నిలబెట్టాలనుకున్నారట జగన్‌. ఇందులో భాగంగానే శరత్‌చంద్రారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరు దాదాపు ఖరారైందని.. ఇక ప్రకటించడమే తరువాయి అంటూ వైసీపీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

ఇక్కడే ట్విస్ట్‌ ఏంటి అంటే.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో శరత్‌చంద్రారెడ్డి ప్రధాన నిందితుల్లో ఒకరు. మద్యం పాలసీని రూపొందించడంలో శరత్‌చంద్రారెడ్డి కీలక్ పాత్ర పోషించినట్టు సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇదే కేసులో శరత్‌చంద్రారెడ్డిని అరెస్ట్‌ కూడా చేశారు. తరువాత ఆయన అప్రూవర్‌గా మారడంతో విడుదల చేశారు. ఇప్పుడు అదే శరత్‌చంద్రారెడ్డికి జగన్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. లిక్కర్‌ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అది రాజకీయవర్గాల్లో జరగుగుతన్న చర్చ మాత్రమేనా.. లేక నిజంగానే శరత్‌చంద్రారెడ్డినే ఎంపీగా పోటీ చేయిస్తారా చూడాలి.