Chandrababu, YS Sharmila : బాబుకు రాసిన లేఖలోనూ జగన్‌పై తిట్లు.. నువ్ మారవా షర్మిల !

ఏపీ సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం గ్రాండ్‌గా జరిగింది. దేశవ్యాప్తంగా వీఐపీలు, వీవీఐపీలు అంతా.. కేసరపల్లిలోనే కనిపించారు.

 

 

ఏపీ సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం గ్రాండ్‌గా జరిగింది. దేశవ్యాప్తంగా వీఐపీలు, వీవీఐపీలు అంతా.. కేసరపల్లిలోనే కనిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబుకు.. ప్రతీ ఒక్కరు అభినందనలు తెలుపుతున్నారు.

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ (AP Congress chief), మాజీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల (YS Sharmila) కూడా.. చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ ఓ లేఖ రిలీజ్ చేశారు. ఐతే అందరిలా కాకుండా.. ఈ లేఖ కాస్త కొత్తగా అనిపించింది. ఇదే షర్మిల మళ్లీ టార్గెట్ అయ్యేలా చేస్తోంది. అన్నను ఓడించడమే లక్ష్యంగా ఏపీ రాజకీయాల్లోకి దిగిన షర్మిల.. రాయలసీమలో వైసీపీ (YCP) కోలుకోలేని దెబ్బతినడంలో అంతో ఇంతో ప్రభావం చూపించింది. ఐతే ఇప్పుడు అదే అన్నపై తిట్ల వర్షం కురిపిస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు షర్మిల. చారిత్రాత్మకమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన జనాల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా… రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నామని ఆ లేఖలో తెలిపారు షర్మిల. ఎన్నికల ఫలితాల తర్వాత చోటుచేసుకున్న దాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన షర్మిల.. జగన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

గడచిన ఐదేళ్లలో జరిగిన విశృంఖల పాలన.. దాని కారణంగా అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలోపెట్టి… ముందుకు తీసుకునివెళతారని జనాలు మీకు ఈ తీర్పు ఇచ్చారని.. దానికి అనుగుణంగా నడుచుకుని, వైఎస్‌ విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని రాసుకొచ్చింది. దాడుల ఆపాలని కోరటం బాగానే ఉంది కానీ.. అడిగే పద్దతి ఇదా షర్మిల.. నువ్ ఇంకా ఎప్పటికీ మారవా అంటూ వైసీపీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయ్.

దాడులు ఆపాలని చెప్పే పద్ధతి ఇదేనా అని విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దాడుల గురించి చంద్రబాబుని ప్రశ్నించారు సరే.. జగన్‌పై నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. షర్మిల కేవలం జగన్‌ని మాత్రమే టార్గెట్ చేశారని.. చంద్రబాబుకి వంతపాడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.