ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) చూసి చంద్రబాబు (Chandrababu) కి భయం పట్టుకుంది. రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబునే దాదాపు 50 రోజులు జైల్లో పెట్టడమంటే మాటలా… ఈసారి మళ్ళీ జగన్ గెలిచి అధికారంలో వచ్చారంటే… తండ్రీ, కొడుకులు ఇద్దర్నీ జగన్ రెడ్డి మడత పెట్టేడం ఖాయం. విధి వక్రించి… బాబు తలరాత తిరగబడితే… ఇద్దరూ జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే. జగన్ దగ్గర ఇంకా ఎన్నో అస్త్రాలు రెడీగా ఉన్నయ్. ఇప్పటి వరకూ బాబుకి చూపించినవి శాంపిల్స్ మాత్రమే. ఎన్నికల తర్వాత అసలు జగన్ బయటకొస్తే… బాబుకు చుక్కలే అంటున్నారు పరిశీలకులు. అందుకే జగన్ భయంతోనే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
జనసేన(Jana Sena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మొదటి నుంచీ NDAలో భాగస్వామి… మోడీ, అమిత్ షాకి దగ్గర మనిషి. సో… ఆయనతో పెట్టుకోవాలంటే జగన్ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు… 2019లో మోడీని తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు. కమలం పార్టీకి కటీఫ్ చెప్పి…అప్పట్లో నల్ల బట్టలు వేసుకొని కాంగ్రెస్ లీడర్ల చేతులు పట్టుకొని తిరిగాడు. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఐదేళ్ళు అధికారానికి దూరమయ్యాడు బాబు. అటు కేంద్రంలో బీజేపీకి టార్గెట్ గా మారాడు. అదే ఐదేళ్ళ పాటు అధికారం కోసం కసిగా ఎదురు చూసిన జగన్… పవర్ చేతికొచ్చాక చంద్రబాబుకు చుక్కలు చూయించాడు. హైదరాబాద్ సృష్టికర్తను నేనే… NDA (NDA Alliance) ప్రభుత్వాన్ని నడిపించింది నేనే… దేశ రాజకీయాల్లో చక్రం తిప్పింది నేనే… అని ఒకప్పుడు గొప్పలు చెప్పుకున్న బాబును 48 రోజులు జైల్లో వేశాడు. బెయిల్ కూడా రాకుండా చేశాడు. అంతేనా ఇంకా ఉంది అన్నట్టుగా ఉంది జగన్ పరిస్థితి.
రాప్తాడులో వైఎస్సార్ (YSRCP) పార్టీ సిద్ధం సభ చూశాక… బాబు, పవన్ లో టెన్షన్ మరింత పెరిగింది. వామ్మో… బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే… వచ్చేసారి అధికారంలోకి రావడం కాదు… కనీసం టీడీపీకి జనం ఓట్లేసే పరిస్థితి కూడా ఉండదని భావించారు చంద్రబాబు. అందుకే ఆత్మరక్షణ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు టీడీపీ సీనియర్లకు నచ్చజెబుతున్నారు. ఇష్టం లేకున్నా బీజేపీతో టీడీపీ వెళ్లక తప్పని పరిస్థితి అయింది. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు దూరమవుతారని తెలిసినా కమలం గూటికి చేరాల్సిందేనని చంద్రబాబు గట్టిగా ఫిక్సయ్యారు. జగన్ అధికారంలో ఉండగా.. రాబోయే ఎన్నికల్లో ఏదీ తమకు అనుకూలంగా ఉండదని బాబులో భయం పట్టుకుంది. ఎందుకంటే పోలీసులు, అధికారులు, ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ జగన్ కే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే కనీసం టీడీపీ సానుభూతి పరులు, ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు వెళ్ళి ఓట్లేసే పరిస్థితి కూడా ఉండదని బాబుకు అర్థమైంది.
రాయలసీమలో ఈ పరిస్థితి మరింత సీరియస్ గా ఉంటుందని తెలుస్తోంది. జగన్ అంటే జనంలో వ్యతిరేకత ఉంది… తమకే ఓట్లేస్తారని ఒకప్పుడు భ్రమపడిన బాబుకు ఇప్పుడు అవన్నీ తొలగిపోయినయ్. పోటీ చేసినా గెలవడం అసాధ్యమని గుర్తించారు. బీజేపీ అండ ఉంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగే ఛాన్స్ ఉండదు. ఎన్నికల సంఘం కూడా ఏపీలో స్ట్రిక్ట్ గా ఎలక్షన్స్ నిర్వహిస్తుందన్న నమ్మకం. అందుకే కమలం పార్టీ ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇచ్చేసి… మారు మాట్లాడకుండా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు. పొత్తు వద్దని అడ్డం పడుతున్న టీడీపీ (TDP) సీనియర్లకు ఇదీ పరిస్థితి అని చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది. బీజేపీ సహకారంతోనే ఎన్నికలకు వెళ్లడం మంచిదని బాబు వాళ్ళకి వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ కు ఎనీ టైమ్… ఎనీ సెంటర్… అంటూ ఛాలెంజ్ లు విసురుతున్న చంద్రబాబు… లోపల మాత్రం టెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది.