Sharmila : తారకరత్న భార్యకు షర్మిల స్పెషల్‌ ఇన్విటేషన్‌.. ఎందుకో తెలుసా..?

మొన్నటి వరకూ తెలంగాణ పాలిటిక్స్‌ దేశం మొత్తాన్ని అట్రాక్ట్‌ చేశాయి. తెలంగాణ ఎలక్షన్‌లో జరిగిన నెక్‌ టు నెక్‌ ఫైట్‌.. ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠ రేపింది. చివరి నిమిషం వరకూ కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇలాంటి త్రిల్లింగ్‌ పాలిటిక్స్‌ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు అకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో వరుసగా జరుగుతున్న పరిణామాలు అంతకంటే త్రిల్లింగ్‌గా మారిపోయాయి.

మొన్నటి వరకూ తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politrix)  దేశం మొత్తాన్ని అట్రాక్ట్‌ చేశాయి. తెలంగాణ ఎలక్షన్‌లో జరిగిన నెక్‌ టు నెక్‌ ఫైట్‌.. ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠ రేపింది. చివరి నిమిషం వరకూ కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇలాంటి త్రిల్లింగ్‌ పాలిటిక్స్‌ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు అకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో వరుసగా జరుగుతున్న పరిణామాలు అంతకంటే త్రిల్లింగ్‌గా మారిపోయాయి. అసంతృప్త నేతలంతా తీర్చుకోండి మార్చుకోండి అన్నట్టు పార్టీలు మారిపోతున్నారు. ఇక షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న చాలా మందిని కలిసిన షర్మిల.. ఇప్పుడు తారకరత్న భార్య అలేఖ్యరెడ్డిని కూడా కలిశారు.

తన కొడుకు రాజారెడ్డి (Raja Reddy) పెళ్లికి  (Wedding Invitation) రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇందులో రాజకీయ కోణం ఏదీ లేకపోయినా.. అలేఖ్యను షర్మిల కలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తారకరత్న చనిపోయినప్పుడు కూడా షర్మిల అలేఖ్యకు చాలా ఎమోషనల్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. సొంత చెల్లేమో అన్నంత ప్రేమగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అయితే అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్‌ నాయకురాలు. సొంత అన్న జగన్‌కు రాజకీయంగా వ్యతిరేకి. అలాంటి షర్మిల వరుసగా టీడీపీ నేతలను కలుస్తుండటం ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా నారా లోకేష్‌కు షర్మిల క్రిస్మస్‌ గిఫ్ట్‌ కూడా పంపారు.

ఇక చంద్రబాబు ఇంటికి స్వయంగా వెళ్లి ఇన్విటేషన్‌ కార్డ్‌ ఇచ్చారు. ఇప్పుడు అలేఖ్య రెడ్డి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డిని షర్మిల కలిసిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇవన్నీ పర్సనల్‌ టూర్‌లు ఐతే ఓకే. కానీ.. కొడుకు పెళ్లి తరువాత కూడా ఈ నేతలతో షర్మిల ఇదే రిలేషన్‌ కంటిన్యూ చేస్తే.. జగన్‌ గడ్డు పరిస్థితి ఫేస్‌ చేయక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి సొంతన్నకు షర్మిల ఎలాంటి ట్విస్ట్‌లు రాసిపెట్టిందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.