YS Sharmila : షర్మిలకు షాక్‌.. చెల్లిపై ఈసీకి అన్న ఫిర్యాదు

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివేకా కేసు నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ వరకు..

 

 

 

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివేకా కేసు నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ వరకు.. ప్రతీ విషయంలో అన్నను ఘాటైన పదాలతో నిలదీస్తున్నారు. వైఎస్ కొడుకే కాదని.. ఆయన గుణం ఒక్కటి లేదంటూ షర్మిల చేస్తున్న కామెంట్లు.. ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయ్. ఐతే షర్మిల భాష మీద, వాడుతున్న పదాల మీద వైసీపీ నేతలు గరంగరంగా ఉన్నారు.

జగన్‌ను కించపరిచేలా షర్మిల మాట్లాడుతున్నారని..
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. షర్మిలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏపీ సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదులు చేసి, వాటికి ఆధారాలను సమర్పించారు. షర్మిలతో పాటు పవన్‌, టీడీపీ మీద కూడా కంప్లైట్ ఇచ్చారు. సీఎం జగన్‌ని టీడీపీ నేతలు సైకోగా సంబోధిస్తూ.. పాటను సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అంటూ ఫిర్యాదు చేశారు. టీడీపీతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నాయని ఫైర్ అయ్యారు విష్ణు.

వివేకా కేసు గురించి మాట్లాడొద్దని కోర్టు చెప్పినా.. షర్మిల పదేపదే ప్రస్తావిస్తున్నారని ఫిర్యాదు పత్రంలో చేర్చారు. జాబ్‌లు, కొండలు, రోడ్లపై జనాలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రదర్శిస్తున్న పాటను పోస్టు చేసిన వారితో పాటు రాసిన వారు, కంపోజ్‌ చేసిన వారు, పాడిన వారిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు మల్లాది విష్ణు. మరి వైసీపీ నేతల ఫిర్యాదులపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.