JANASENA: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో రాజకీయంగా ఒకరినొకరు దెబ్బకొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని పార్టీలు. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందానికి.. ఏపీలో అక్రమ ఓట్లపై అన్ని పార్టీలు కంప్లయింట్ చేశాయి. దీని మీద ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా గుర్తుల మీద అభ్యంతరం చెబుతూ.. రెండు పిటిషన్లు CECకి చేరాయి. అందులో ఒకటి జనసేన గాజు గ్లాస్ కామన్ సింబల్ రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేయగా.. వైసీపీ గుర్తు ఫ్యాన్‌ని లిస్ట్‌లో తొలగించాలని బీజేపీ కంప్లయింట్ చేయడం విశేషం.
AMBATI RAYUDU: క్రికెట్‌లో.. రాజకీయాల్లో.. నిలకడలేని రాయుడు.. వాట్ ఈజ్ దిస్..?
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన కూటమి మధ్య అసెంబ్లీ ఎన్నికలు రాక ముందే పెద్ద యుద్ధం నడుస్తోంది. గ్రౌండ్ లెవల్ పరిస్థితులు చూడ్డానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ పార్టీల నుంచి పరస్పరం ఫిర్యాదులు వచ్చాయి. ఈ వివాదం మధ్యలో జనసేనకు కొత్త చిక్కు వచ్చిపడింది. వైసీపీ నుంచి CECకి అందిన ఫిర్యాదుతో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు పోయేలా ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేనకు అసలు గుర్తింపే లేదు.. ఆ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడమేంటని అభ్యంతరం పెట్టారు. ఈసీ గుర్తుంపు లేని పార్టీకి కామన్ సింబల్ ఎలా ఇస్తారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనకు గాజు గ్లాసు ఇవ్వలేదని ఎన్నికల అధికారులకు కంప్లయింట్ చేసింది వైసీపీ. నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పార్టీ.. వరుసగా రెండు ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. మరి వైసీపీ కంప్లయింట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు గాజు గ్లాసు కామన్ సింబల్ తీసేస్తారా..? తెలంగాణలో లాగా అన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్‌కి గ్లాసు కేటాయిస్తే.. జనసేన పరిస్థితి ఏంటి..? తెలంగాణలో కూడా గాజు గ్లాసు సింబల్ ఉన్న ఇండిపెండెంట్స్‌లో కొందరికి వందల్లో ఓట్లు వచ్చాయి.
రాబోయే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన ఏ గుర్తుపై పోటీచేయాలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు ఇవ్వకపోతే.. జనసేన అభ్యర్థులంతా టీడీపీ సింబల్‌పై పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఎన్నికల కమిషన్‌కు ఏపీ బీజేపీ నుంచి వచ్చిన ఫిర్యాదుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటంటే.. వైఎస్సార్ పార్టీకి ఇచ్చిన ఫ్యాన్ గుర్తు తీసెయ్యాలి అనేది డిమాండ్. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలింగ్ కేంద్రాల దగ్గర పార్టీల గుర్తులను ప్రదర్శించకూడదు. కానీ పోలింగ్ సెంటర్లలో ఎలక్షన్ స్టాఫ్ కోసం గదుల్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపిస్తాయి. ఆ ఫ్యాన్లు చూసి ఓటర్లు ప్రభావితం అవుతున్నారు. అందువల్ల వైసీపీ సింబల్ ఫ్యాన్ గుర్తు తీసేయాలని బీజేపీ నేతలు కోరారు. బీజేపీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ పాకా సత్యనారాయణ ఈ కంప్లయింట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పోలింగ్ బూత్‌లో ఫ్యాన్ కనిపిస్తుందని ఆ సింబల్ తొలగించాలంటే.. ఓటర్లు సైకిల్ మీద వస్తుంటారు.. టీడీపీ గుర్తుగా సైకిల్ తీసెయ్యాలా..? మనుషులకు రెండు చేతులు ఉంటాయి. అప్పుడు హస్తం గుర్తు కూడా తొలగించాలా.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల ఫిర్యాదులతో మొత్తానికి జనసేనకు మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది. గ్లాస్ సింబల్ పోతుందేమోనని ఆ పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.