TARAK WIFE : తారకరత్న భార్య అలేఖ్య కన్నీళ్ళు.. నందమూరి ఫ్యామిలీ వదిలేసిందా ?

నందమూరి తారకరత్న హఠాత్తుగా చనిపోవడంతో ఆ ఫ్యామిలీ దిక్కులేనిది అయిపోయింది. గత ఏడాది లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.

నందమూరి తారకరత్న హఠాత్తుగా చనిపోవడంతో ఆ ఫ్యామిలీ దిక్కులేనిది అయిపోయింది. గత ఏడాది లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆయన్ని బెంగళూరుకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దాంతో ఆయన కుటుంబం పుట్టె కష్టాల్లో ఉందిప్పుడు. అలేఖ్య రెడ్డితో తారకరత్నకి జరిగిన ప్రేమ వివాహాన్ని ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ ఒప్పుకున్నట్టు లేదు. అలేఖ్య… వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి బంధువు కూడా. కులాలు వేరు కావడంతో తారకరత్న పెళ్ళిని తండ్రి మోహన్ కృష్ణ ఒప్పుకోలేదు. దాంతో తన భార్యతో కలసి నందమూరి ఫ్యామిలీతో సంబంధం లేకుండా విడిగా ఉన్నారు. వీళ్ళకి ఇద్దరు కూతుళ్ళు, ఒక బాబు పుట్టాడు. సినిమాలు ప్లాఫ్ అవడంతో… ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఆ ఫ్యామిలీకి తారకరత్న మరణం తర్వాత మరిన్ని కష్టాలు వచ్చాయి. రాజకీయాల్లో వద్దామనుకున్న తారకరత్న హఠాత్తుగా చనిపోయారు.

తన కొడుకు అంతిమయాత్ర టైమ్ లో కూడా తారకరత్న భార్య, పిల్లలను మోహన్ కృష్ణ దగ్గరకు తీసుకోలేదు. ఆయన చనిపోయాక అయినా… భార్య, పిల్లల్ని చేరదీస్తారని అంతా అనుకున్నారు. కానీ అలేఖ్య తన పిల్లలతో ఇంకా విడిగానే ఉంటోంది. నందమూరి ఫ్యామిలీతో ఎప్పటికైనా కలిసిపోవాలని ఆశపడుతోంది. కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదన్న సంగతి తాజాగా బయటపడింది. అలేఖ్య తన ఫాలోవర్లతో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికైనా తారకరత్న ఫ్యామిలీని… పేరెంట్స్ పట్టించుకుంటున్నారా… కోడలిగా అంగీకరించి మీకు సపోర్టింగ్ గా ఉంటున్నారా… అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి అలేఖ్య సమాధానం ఇచ్చింది. ఆశ, నమ్మకాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఆ నమ్మకంతోనే తారక్… నేను ఇన్నేళ్ళు మా జీవితాల్ని గడిపాం.

నేను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నా… ఖచ్చితంగా ఆ రోజు వస్తుందన్న నమ్మకం ఉందని కామెంట్ చేసింది. అలేఖ్య ఇచ్చిన సమాధానంతో నెటిజన్లు షాక్ అయ్యారు. తారకరత్న చనిపోయినా… ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ కోడల్ని చేరదీయకపోవడంతో… పాపం… తానే కష్టాలు పడుతూ పిల్లల్ని పెద్ద చేస్తోందని బాధపడుతున్నారు. నందమూరి బాలకృష్ణ అయినా తారకరత్న ఫ్యామిలీని పట్టించుకోవాలని అభిమానులు కోరుతున్నారు. యువగళం పాదయాత్రలో చనిపోయినందున… కనీసం చంద్రబాబు, లోకేశ్ అయినా అలేఖ్య, పిల్లల్ని… నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేలా చూడాలని కోరుతున్నారు.