AP TDP BJP : బాబు చెబితేనే కమలంలోకి ఎంట్రీ.. ఏపీ బీజేపీపై టీడీపీ డామినేషన్

బీజేపీ, జనసేన సాయంతో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ. కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటోంది. మూడు పార్టీల నేతలు కలసి కట్టుగా పనిచేస్తున్నారు.

బీజేపీ, జనసేన సాయంతో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ. కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటోంది. మూడు పార్టీల నేతలు కలసి కట్టుగా పనిచేస్తున్నారు. పార్టీల పరంగా మాత్రం ఎవరి జెండా వారిదే. ప్రతి పార్టీకీ అధ్యక్షులు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే… ఏపీలో అన్ని పార్టీలపైనా టీడీపీ ఆజమాయిషీయే నడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది కలసి నడుస్తామని సంకేతాలు ఇవ్వడానికా… లేదంటే… మేం చెప్పినట్టు వినాలన్న ధోరణా అన్నది బీజేపీ, జనసేన లీడర్లకు అర్థం కావట్లేదు.

వైసీపీ మరీ 11 సీట్లకు పడిపోవడంతో… ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… మాజీలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా వైసీపీ నేతలపై దాడులు జరుగుతుండటం, పాత కేసులు తిరగతోడుతుండటం… అప్పటి అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తుండం వాళ్ళకి ఇబ్బంది మారింది. అందుకే వీలైనంత తొందరగా వైసీపీకి రిజైన్ చేసి బీజేపీ లేదంటే జనసేనలో చేరాలని భావిస్తున్నారు. గత ఐదేళ్ళుగా వైసీపీలో ఉండి తమను ఇబ్బంది పెట్టారనీ… అందుకే టీడీపీలో చేర్చుకోవద్దని జిల్లా స్థాయిలో తమ్ముళ్ళ నుంచి అధిష్టానంపై ఒత్తిడి వస్తోంది. అందుకే వాళ్ళంతా బీజేపీ వైపు చూస్తున్నారు. పైగా కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉండటంతో కమలంలో జాయిన్ అయితేనే బెటర్ అనుకుంటున్నారు.
కానీ చేరికల విషయంలో ఏపీ బీజేపీలో అయోమయం కనిపిస్తోంది.

2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక… కొందరు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు. వాళ్ళల్లోనే కొందరు 2024 ఎన్నికల్లో అసెంబ్లీ, ఎంపీ స్థానాల నుంచి గెలిచారు. ఇప్పుడు ఏపీలో డామినేట్ చేస్తోంది పాత టీడీపీ తమ్ముళ్ళే అన్న టాక్ నడుస్తోంది. వైసీపీ నుంచి ఎవర్ని చేర్చుకోవాలి… ఎవరు వద్దు అన్నది మాజీ టీడీపీ… ప్రస్తుత బీజేపీ లీడర్లే డిసైడ్ చేస్తున్నారు. ఈమధ్య తోట త్రిమూర్తులుతో పాటు కొందరు వైసీపీ లీడర్లు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో సంప్రదించారు. కానీ ఆ బీజేపీ లీడర్లు మాత్రం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్మిషన్ తీసుకోడానికి వెళ్ళారు. అందరం కలసి కూర్చొని మాట్లాడుకుందాం అని లోకేష్ చెప్పడంతో వైసీపీ నేతల చేరికకు బ్రేక్ పడింది. బీజేపీకి ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ఉన్నారు. ఆమె ఎంపీగా గెలిచినా… ఇంకా ఆ పోస్టులోనే కొనసాగుతన్నారు. అలాంటిది చేరికల విషయంలో బీజేపీ నేతలు లోకేష్ పర్మిషన్ తీసుకోవడం ఏంటని డౌట్ వస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే… ఏపీలో బీజేపీని టీడీపీకి రాసిచ్చారా… అన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీలోనూ టీడీపీ నీడలో ఉండటం వల్ల బీజేపీ రెండు రాష్ట్రాల్లోనూ ఎదగలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతోందని ఏపీ కమలం నేతల వర్రీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యారు.