TDP NOMINATIONS: ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వేళ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది టీడీపీ. కొత్తగా మడకశిర నుంచి MS రాజుకు, ఉండి నుంచి రఘురామ కృష్ణరాజుకు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకు, వెంకటగిరి నుంచి కురుగొండ రామకృష్ణకు టిక్కెట్ ఇచ్చింది. ఆయా అభ్యర్థులకు ఇప్పటికే బీఫాం కూడా అందజేసింది.
T20 WORLD CUP: టీ20 వరల్డ్ కప్.. 10 మంది ఫిక్స్.. మిగిలిన ఐదుగురు ఎవరు..?
దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీఫామ్‌లు మాత్రం పెండింగ్‌లో ఉంచింది. వెంకటగిరి టికెట్ కూతురు నుంచి తండ్రికి వెళ్లడం విశేషం. ఈ స్థానాన్ని ఇదివరకూ రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే, సర్వే తర్వాత తిరిగి రామకృష్ణకు కేటాయించారు. పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించిన నేపథ్యంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. ఉండి నుంచి రఘురామకు టిక్కెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటివరకూ ఇదే స్థానంలో కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొటిల్ బ్యూరోలోకి తీసుకున్నారు. పాడేరు టికెట్‌ను ఇంతకుముందు వెంకట రమేశ్ నాయుడుకు కేటాయించారు. అయితే, తర్వాత జరిగిన మార్పుల్లో గిడ్డి ఈశ్వరికి కేటాయించారు. మడకశిర నుంచి సునీల్ కుమార్‌కు ఇంతకుముందు టిక్కెట్ కేటాయించగా.. ఇప్పుడు ఎంఎస్ రాజుకు ఇచ్చారు. అనపర్తి వ్యవహరంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించిన నల్లమిల్లి రెబల్‌గా మారారు.
టీటీపీ టిక్కెట్ ఆయనకు దక్కకపోతే బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఈ టిక్కెట్ బీజేపీకా.. లేక టీడీపీకా అనేది తేలాలి. బీజేపీకి కేటాయించినా.. అక్కడినుంచి నల్లమిల్లినే పోటీ చేయొచ్చు. ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆదివారం ఉదయం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంతా కృషి చేయాలని అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. బీ ఫారం అందుకుంటున్న నేపథ్యంలో నారా లోకేశ్ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.