విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి దూరం.. కారణమిదేనా… చంద్రబాబు నిర్ణయం కరెక్టేనా ?

  • Written By:
  • Updated On - August 13, 2024 / 04:13 PM IST

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స పోటీకి దిగగా.. దీనిపై కూటమి ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఐతే పోటీ నుంచి దూరంగా ఉండాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన నిర్ణయం కరెక్టేనా అనే చర్చ జరుగుతోంది. పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం కారణం ఏమై ఉంటుందా అని రకరకాల చర్చ జరుగుతోంది. ఐతే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. చాలా తెలివైనదనే మెజారిటీవర్గాల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు వైసీపీది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడంతో.. ఆయన అభ్యర్థిత్వం రద్దయింది. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయ్.

విశాఖ స్థానిక సంస్థల్లో మొత్తం 838 ఓట్లు ఉన్నాయ్. వాటిలో వైసీపీ బలం 598. కూటమికి 240వరకు సంఖ్యాబలం ఉంది. ఎన్నిక అంటూ జరిగితే నైతికంగా వైసీపీ గెలవాలి. రాజకీయాల్లో ఇలాంటి విలువలు ఇప్పుడు లేవు కాబట్టి.. ఆ సీటు నెగ్గేందుకు కూటమి ప్రయత్నిస్తుందని అంతా అనుకున్నారు. కూటమి గెలవాలి అంటే.. 180మంది వైసీపీ ఓటర్లు తమకు అనుకూలంగా ఓటేయాల్సిఉంటుంది. ప్రలోభాల పర్వం కూడా మొదలైందనే టాక్ నడిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి అంటే.. మ్యాజిక్ ఫిగర్ 4వందలు అనుకున్నా.. ఒక్కో ఓటర్‌కు 10 లక్షల లెక్కేసుకున్నా.. 4వందల మంది ఓటర్లకి కలిపి 40కోట్లు అవుతుంది. ఏ పార్టీకైనా అంతే ఖర్చు. ఐతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి పారిపోకుండా… ముందుగానే అభ్యర్థిని అనౌన్స్ చేయడం ద్వారా జగన్.. తన రాజకీయ ఉనికిని చాటుకున్నారు. ఆరు నూరైనా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓడిపోయినా… రాజకీయం చేయడానికి వెనకాడనని… ఆ ఎన్నిక ద్వారా స్పష్టంగా చెప్పేశారు. అంతేకాదు అభ్యర్థులతో విడివిడిగా సమావేశాలు జరిపారు. బెంగళూరు, శ్రీలంకలో క్యాంపులు పెట్టి అక్కడికి తరలించారు. ఈ ఏర్పాట్లు, మొత్తం వ్యవహారం చూసిన తర్వాత… కూటమి అధినేత చంద్రబాబు కొంత రియలైజ్ అయినట్టున్నారు. 2వందల మంది అభ్యర్థుల్ని కూటమి వైపు లాగడం చాలా కష్టం. డబ్బు మాట అటుంచి…. చాలా పెద్ద కసరత్తు చేయాలి. ఐదు పది మంది అయితే ఏదో నెట్టుకురావొచ్చు కానీ.. ఇంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. 164సీట్లు గెలిచి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని చూసి… ఇప్పుడు ఈ పనికిమాలిన పని చేయడం, ప్రజాప్రతినిధులను డబ్బులు ఇచ్చి కొనడం… ఒకరకంగా కూటమి స్ఫూర్తిని, గొప్పదనాన్ని దెబ్బతీస్తుంది. జనం 164 సీట్లు ఇస్తే ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఎంత కక్కుర్తి అవసరమా… అది కూడా మీది కాని సీటు కోసం ఎందుకు ఇలాంటి బేరసారాలు అనే చర్చ కచ్చితంగా జరుగుతుంది. కూటమి పరువు కూడా పోతుంది. ఐతే అవన్నీ పక్కనపెట్టి… 2వందల మందిని కొనేసి.. ఎమ్మెల్సీ సీటు గెలుచుకుంటే.. జగన్ చేతికి పెద్ద ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. రేపటి నుంచి జగన్ జనంలో తిరగడం మొదలు పెడతారు. పదేళ్ల కిందటి తెలంగాణ ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తారు. చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి చిల్లర పనులు చేస్తాడో చెప్పుకొస్తారు. కన ప్రజా ప్రతినిధుల్ని చంద్రబాబు ఎలా కొన్నాడో చూడండి అని జనం ముందుకి గోల గోల చేస్తాడు. 124సీట్లు ఇచ్చి ఎంత క్లీన్ మెజారిటీ ఇచ్చినా.. చంద్రబాబు కక్కుర్తి పనులు మానలేదని వైసీపీ వాళ్లు అల్లరి మొదలు పెడతారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం నైతికంగా ఎంత డ్యామేజ్ అవసరమా అని చంద్రబాబు కచ్చితంగా ఆలోచించి ఉంటారు. పోటీలో నిలబడితే…. ఎలాంటి బేరసారాలు లేకుండా పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతాం… దానివల్ల ఒరిగేదేమీ లేదు. పోటీలో నిలబడి 50 కోట్లు ఖర్చుపెట్టి, ప్రజా ప్రతినిధులను కొని గెలిచినా.. ఆ గెలుపునకు విలువ ఉండదు. జగన్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది. జనంలోకి వచ్చి చంద్రబాబు అనైతిక చర్యల్ని చంద్రబాబు అనైతిక చర్యల్ని ఎండగడతాడు జగన్. ఇవన్నీ కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఇలా అన్నీ ఆలోచించే.. చంద్రబాబు పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఒకరకంగా ఆయన తీసుకున్న నిర్ణయం మంచిది అంటూ.. మరికొందరు అంటున్నారు.