NARA LOKESH: లోకేశ్‌పై సీనియర్ల తిరుగుబాటు.. ఇప్పుడు నాని.. నెక్ట్స్ ఎవరు..?

లోకేశ్‌ వల్లే పార్టీలో ఈ పరిస్థితి అన్నట్లుగా మాట్లాడారు నాని. ఐతే ఆయనతో పాటు చాలామంది సీనియర్లు.. లోకేశ్‌ మీద గుర్రుగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. కేశినేని రాజీనామాతో ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది.

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 04:29 PM IST

NARA LOKESH: రాజకీయ పార్టీల్లో ఓ కీలక ఘట్టం చోటుచేసుకుంది అంటే.. దానికి ముందు, తర్వాత జరగబోయే, జరుగుతున్న పరిణామాలు మాములుగా ఉండవు. ఇప్పుడు టీడీపీలోనూ అలాంటి పరిస్థితే ఉందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. బెజవాడ ఎంపీ కేశినేనా నాని టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. తన ఆఫీస్‌ మీద పసుపు రంగు కూడా ఉండకూడదు అన్నట్లుగా క్లీన్ చేయించారు. వైసీపీలో చేరలేదు కానీ.. దాదాపు చేరినట్లే. జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ తర్వాత చంద్రబాబు, లోకేశ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా లోకేశ్‌ను టార్గెట్‌ చేస్తూ నాని గుప్పించిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. లోకేశ్‌ వల్లే పార్టీలో ఈ పరిస్థితి అన్నట్లుగా మాట్లాడారు నాని.

Pervez Musharraf: మరణం తర్వాత మరణశిక్ష.. ముషారఫ్‌ శిక్షను సమర్ధించిన కోర్టు

ఐతే ఆయనతో పాటు చాలామంది సీనియర్లు.. లోకేశ్‌ మీద గుర్రుగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. కేశినేని రాజీనామాతో ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది. జగన్‌తో సమావేశం తర్వాత మాట్లాడిన నాని.. లోకేశ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయ్. లోకేశ్‌ పార్టీలో సీనియర్లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడని.. తాను పార్టీని వీడటానికి ఒక రకంగా ఆయన వైఖరి కూడా కారణమన్నారు నాని. ఐతే పార్టీలో మరో సీనియర్ నేత అచ్చెన్న కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అచ్చెన్నకు, లోకేశ్‌కు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. రాబోయే ఎన్నికల కోసం అచ్చెన్న తన వర్గానికి టికెట్లు కోరగా.. కనీసం లోకేశ్‌ లెక్కలోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో అచ్చెన్న లోలోపల మధనపడుతున్నట్లు సమాచారం. ఇక అటు మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా లోకేశ్‌ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ సీనియర్లకు లోకేశ్ ఏ మాత్రం గౌరవం ఇవ్వడని.. ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడంటూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయ్. రాబోయే ఎన్నికల్లో బుచ్చయ్యకు సీటు ఇచ్చేది లేదని.. ఇప్పటికే పార్టీ అధిష్టానం తేల్చేసిందని సమాచారం. బుచ్చయ్య చౌదరి సీటును జనసేనకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోందని, సీటు నిరాకరించే విషయంలో లోకేశ్ పాత్ర కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో బుచ్చయ్యచౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇది నిజంగా నిజం అవుతుందా.. సీనియర్లు నిజంగా అసంతృప్తితో ఉన్నారా అంటే.. రాబోయే రోజులే ఆన్సర్ చెప్పాలి మరి.