NEGGEDEVARU ELR ASSLY : ఎవరొచ్చినా పొడిచేదేమీ లేదు ఆళ్ళ నానికి టీడీపీ చెక్ పెడుతుందా?

రాజకీయ (Political) చైతన్యం ఉన్న ఏలూరు (Eluru) అసెంబ్లీకి (assembly constituency) కాబోయే ఎమ్మెల్యే ఎవరు? దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలకు చెక్ పెట్టగలిగే నాయకుడెవరు?

రాజకీయ (Political) చైతన్యం ఉన్న ఏలూరు (Eluru) అసెంబ్లీకి (assembly constituency) కాబోయే ఎమ్మెల్యే ఎవరు? దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలకు చెక్ పెట్టగలిగే నాయకుడెవరు? నియోజకవర్గ రూపురేఖలు మార్చగలిగే నాయకుడిని…ప్రజలు ఇప్పటికైనా ఎన్నుకున్నారా? మాజీ మంత్రి ఆశలు ఫలిస్తాయా ? లేదంటే టీడీపీ (TDP) అభ్యర్థి గెలుపు జెండా ఎగురవేస్తారా ? ఇంతకీ ఏలూరు నియోజకవర్గం లో నెగ్గేదెవరు ?

ఏలూరు అసెంబ్లీ (Eluru Assembly) నియోజకవర్గం…ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వస్తుంటాయి. బ్రిటీష్ కాలంలో ఉన్న వసతులే ఇప్పటికీ ఉన్నాయి. పేరుకే కార్పొరేషన్ అయినా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రమే. మాజీ మంత్రి ఆళ్ల నాని…వైసీపీ తరపున పోటీ చేస్తుంటే… తెలుగుదేశం నుంచి బడేటి బుజ్జి తమ్ముడు రాధాక్రిష్ణ బరిలోకి దిగారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్లనాని గెలుస్తారా.. లేక టిడిపి నుంచి మొదటిసారి పోటీచేస్తున్న బడేటి రాధాకృష్ణ విజయం సాధిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ది బడేటి బుజ్జి… 24వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో ఆళ్ల నాని 4 వేల ఓట్లతో విక్టరీ కొట్టారు. కొంతకాలం క్రితం బడేటి బుజ్జి చనిపోవడంతో..ఆయన సోదరుడు బడేటి రాధాకృష్ణను బరిలోకి దించింది టీడీపీ.

ఏలూరు నియోజకవర్గంలో 2 లక్షల 35 వేల మంది ఓటర్లు ఉంటే… వాళ్ళల్లో లక్షా 65 వేల మంది ఓట్లు వేశారు. అంటే 70.17 శాతం పోలింగ్ నమోదైంది. తగ్గిన ఓటింగ్…పార్టీల పెరిగిన అంచనాలతో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే… ఏలూరులోనే తక్కువ పోలింగ్ నమోదైంది. నగరవాసులు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ప్రభావం ఏ పార్టీపై పడుతుందనేది సస్పెన్స్ గా మారింది.

ఆళ్ల నాని బలాలను పరిశీలిస్తే…నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉండటం, సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగడం, వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఆయనకు ప్లస్ పాయింట్లు. దీనికి తోడు జగన్ చరిష్మా, స్థానిక నేతల చేరికలు కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. 2004, 2009లో వైఎస్ అండతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సెకండ్ క్యాడర్ ఎదగకుండా…నియోజకవర్గంలో తనకు ఎదురులేకుండా చూసుకున్నారు. మరోసారి జగన్ చరిష్మాను నమ్ముకుని విజయంపై ధీమాతో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా ఆళ్ల నాని… 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రత్యక్షమయ్యారు. 2019లో స్పల్ప మెజార్టీతో గెలిచి…డిప్యూటి సీఎంగా పని చేశారు. మంత్రి పదవి వచ్చాక అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలు ఉన్నాయి. గడప గడప కార్య్రమాన్ని కూడా సిల్లీగా తీసుకోవడంతో… సీఎం జగన్ ఆగ్రం వ్యక్తం చేశారు. చివరికి పార్టీ పెద్దల హెచ్చరికలతో బలవంతంగా గడప గడప ప్రోగ్రామ్ చేపట్టారు.

ఆళ్ళ నాని మూడు సార్లు ఏలూరు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసినా… పేదల ఇళ్ళు, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, అస్తవ్యస్త డ్రైనేజీ, ఆక్రమణల తొలగింపు లాంటి అనేక సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. పార్టీలో పని చేసిన కీలక నేతలు ఆళ్ళ నాని…తీరు నచ్చక ఎన్నికల నాటికి దూరంగా జరిగారు. ఈప్రభావం ఇపుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. సంక్షేమ పధకాలు అమలు, అసంపూర్తి నిర్మాణాలు మినహా ఏలూరులో చెప్పుకోదగ్గ పనులేవీ జరగలేదు. కీలక సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత కూడా ఉంది.
ఇక మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వారసత్వంతో బడేటి రాధాకృష్ట…టిడిపిలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. పార్టీ క్యాడర్ చేజారకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు. జనసేన నుంచి ఏలూరు అసెంబ్లీకి గట్టి పోటీ ఉన్నా… కూటమి తరపున టిడిపి అభ్యర్దిగా బరిలోకి దిగారు. జనసేన సీటు ఆశించి భంగపడిన నేతలను బడేటి చంటి కలుపుకొని వెళ్లారు. కూటమి నేతల మధ్య విభేదాల్లేకుండా చూసుకున్నారు.

దీనికి తోడు నియోజకవర్గంలో టిడిపికి మంచి పట్టు ఉండటం, కష్టకాలంలో సైతం పార్టీని అంటిపెట్టుకుని పని చేసే కేడర్ చంటికి పెద్ద అడ్వాంటేజ్. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత, జనసేన, బీజేపీ కలసి రావడం, వైసిపిలో కీలకంగా ఉన్న కేడర్ టీడీపీ వైపు చూడటంతో…ఏలూరులో టిడిపి బలపడటానికి ప్రధాన కారణమయ్యాయి. జనసేన, బీజేపీ ఓట్లు బదిలీ అయ్యాయా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. పార్టీలో కొందరు నేతల చిల్లర చేష్టలు టీడీపీకి మైనస్ గా మారాయి. మాజీ మంత్రి ఆళ్ళనానిపై వ్యతిరేకత ఉన్నా… అదంతా టిడిపికి అడ్వాంటేజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా మారేలా చేశారు.

మాజీ మంత్రి, కొత్త అభ్యర్థి మధ్య జరిగిన బిగ్ ఫైట్ లో…ఏం జరగబోతుందనేది జూన్ 4న తేలిపోనుంది. ఏలూరు ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో సస్పెన్స్‌కు తెరపడనుంది. రిజల్ట్ ఎలా ఉన్నా… రాజకీయంగా ఏలూరు అసెంబ్లీలో జరిగే పరిణామాలు పొలిటికల్ ట్రెండింగ్ లో ఉంటాయనే చెప్పాలి.