నేడు మోదీ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ (Central Cabinet) కూర్పు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన సుదీర్ఘ కసరత్తు తరువాత కేంద్ర మంత్రి పదవుల విషయంలో ఎన్డీయే పెద్దలు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 10 కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న మిత్ర పక్షాలకు కేంద్ర కేబినెట్ హోదా, రెండు కంటే ఎక్కవుగా ఎంపీ స్థానాలు ఉన్న పార్టీలకు సహాయక మంత్రి (Assistant Minister) పదవి.. ఇవ్వనున్నట్లు సమాచారం..
కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వాళ్లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తెలంగాణ కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కు చోటు లభించింది. వీరిద్దరికీ పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతలకు కేంద్రమంత్రి పదవులు విషయంలో రోజుకో అంశం తెర మీదకి వస్తోంది.. కాగా నేడు ఆ క్లారీటి తరనుంది. కేంద్ర కేబినెట్లో టీడీపీకి 2 నుంచి 4 మంత్రి పదవులు దక్కవచ్చని జాతీయ మీడియా వెల్లడించిన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు(టీడీపీ) (శ్రీకాకుళం), హరీశ్(అమలాపురం), దగ్గుమల్ల ప్రసాద్ (చిత్తూరు), గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ) పేర్లు వినిపిస్తున్నాయి. కాగా వీరు ఈ రోజు మోదీతోపాటే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.మరో వైపు.. మరో సారి నితిన్ గడ్కరీని (Nitin Gadkari) కేంద్ర మంత్రి పదవి వరించనుంది. శర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్ వాల్, జితేంద్రసింగ్, హెచ్ఎ కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన షిండే వర్గం),కు కేబినెట్ లో చోటు దక్కనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఎన్డీఏ నేతగా నరేంద్రమోదీ నేడు ప్రమాణం చేయనున్నారు.