Junior NTR Flexy Removed : తీసెయ్.. ఇప్పుడే ! జూనియర్ ఫ్లెక్సీలు తొలగించిన బాలకృష్ణ

హైదరాబాద్ లో ఎన్టీఆర్ సమాధి (NTR Ghat) సాక్షిగా నందమూరి కుటుంబంలో (Nandamuri family) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆర్డర్ వేశారు నటుడు బాలకృష్ణ. తీసెయ్.. ఇప్పుడే.. అని ఆదేశించాడో లేదో.. సిబ్బంది వెంటనే జూనియర్ ఫ్లెక్సీలు తీసి పక్కన పడేశారు.

హైదరాబాద్ లో ఎన్టీఆర్ సమాధి (NTR Ghat) సాక్షిగా నందమూరి కుటుంబంలో (Nandamuri family) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆర్డర్ వేశారు నటుడు బాలకృష్ణ. తీసెయ్.. ఇప్పుడే.. అని ఆదేశించాడో లేదో.. సిబ్బంది వెంటనే జూనియర్ ఫ్లెక్సీలు తీసి పక్కన పడేశారు. బాలయ్య (Balakrishna) ఇచ్చిన ఆర్డర్స్ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం జరుగుతోంది. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కల్యాణ్ రామ్ (Kalyan Ram) తో కలసి వచ్చి.. ఎన్టీఆర్ (Jr. NTR) కు నివాళులర్పించారు. తారక్ కు మద్దతుగా ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడికి వచ్చాడు బాలయ్య, అతని కుటుంబ సభ్యులు. జూనియర్ ఫ్లెక్సీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చాడు. తీయించేయ్.. ఇప్పుడే.. అని ఆదేశించాడు బాలకృష్ణ. ఆ తరువాత ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి.. వెళ్ళిపోయారు.

తారక్ ఫ్లెక్సీలు తీసేయ్యమని బాలక్రిష్ణ ఆదేశించి.. వెళ్ళిపోగానే.. ఆయన అభిమానులు ఒక్కో ఫ్లెక్సీని తీసి బయటపడేశారు. బాలయ్య చర్యలపై జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు. గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో జూనియర్ – బాలకృష్ణ మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సమాధి సాక్షిగా అవి బయటపడ్డాయి. చాలాకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ శ్రేణులకు అస్సలు పడటం లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ గ్యాప్ బాగా పెరిగింది. బాబు అరెస్ట్ పై తారక్ గానీ.. కల్యాణ్ రామ్ గానీ స్పందించలేదు. నందమూరి కుటుంబ సభ్యులంతా సపోర్ట్ ఇచ్చినా వీళ్ళిద్దరూ కనీసం మెస్సేజ్ కూడా పెట్టలేదు. దాంతో టీడీపీ శ్రేణులకు జూనియర్ పై మరింత కోపం పెరిగింది.

2009 ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి జూనియర్ రాష్ట్రమంతటా పర్యటన చేశారు. హైదరాబాద్ కి తిరిగి వస్తుండగా.. ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్ లో గాయపడ్డాడు కూడా. కానీ ఆ తర్వాత నుంచీ తారక్ ను తొక్కేసే ప్రయత్నం జరిగిందనేది ఆయన అభిమానుల వాదన. హరికృష్ణ విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడని అంటున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒకవైపు ఉంటే.. మిగతా నందమూరి ఫ్యామిలీ అంతా మరో పక్షంలాగా ఉంది. తాజాగా బాలక్రిష్ణ చర్యలతో జూనియర్, టీడీపీ అభిమానుల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరింది.