తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం ఏపీ, తెలంగాణ జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణతో కంపేర్ చేస్తే.. ఏపీ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తిగా కనిపించాయ్. పవన్ చుట్టూ, పిఠాపురం చూస్తే ఈసారి ఏపీ పాలిటిక్స్ (AP Politics) తిరిగాయ్. పిఠాపురం (Pithapuram) లో పవన్‌ను గెలిపించేందుకు.. ఇండస్ట్రీ మొత్తం కదిలిపోయింది. మెగాస్టార్ వీడియో బైట్‌తో ప్రచారం చేస్తే.. రామ్‌చరణ్ (Ram Charan) తో సహా మెగా ఫ్యామిలీ సభ్యులంతా పిఠాపురంలోనే కనిపించారు. పవన్ కోసం, కూటమి కోసం మెగా ఫ్యామిలీ ప్రచారం చేస్తే.. ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం.. వైసీపీ అభ్యర్థి తరఫున నంద్యాలలో ప్రచారం చేశారు. నంద్యాల (Nandyala) వైసీపీ అభ్యర్థి శిల్ప రవి.. బన్నీకి ఫ్రెండ్. స్నేహం కోసమే వచ్చానని బన్నీ చెప్పినా.. సీన్ మాత్రం ఇంకోలా కనిపించింది.
దీంతో ఈ ఎన్నికల్లో బన్నీ ఒకవైపు.. మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా ఇంకో వైపు నిలిచాయ్. పవన్ కోసం చిన్న ట్వీట్ పెట్టి వదిలేసిన బన్నీ.. నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం అక్కడికి వెళ్లి ప్రచారం చేయడం.. మెగా ఫ్యామిలీకి కోపం తెప్పించింది. అందుకే అల్లు అర్జున్‌ను దూరం పెట్టాలని ఫిక్స్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే.. వెలి వేసింది కూడా ! పోలింగ్ ఇలా ముగిసిందో లేదో.. నాగబాబు అలా చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. బన్నీని దూరం పెట్టాలని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయిందని.. నాగబాబు ట్వీట్‌తో అర్థం అవుతోంది. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైనా పరాయివాడేనని నాగబాబు ట్వీట్ పెట్టారు.
తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి చెప్పారని.. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసే వాడు పరాయివాడు అంటే.. అది బన్నీ గురించి రాశాడని.. ప్రచారం మొదలైంది. బన్నీని నిజంగా దూరం పెట్టాలని డిసైడ్ అయితే.. అది రెండు కుటుంబాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. నిజానికి బన్నీకి, మెగా ఫ్యామిలీ మధ్య సంబంధాలు కట్ అయ్యాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గతంలో రాంచరణ్ బర్త్‌డే కూడా బన్నీ కనీసం విష్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు పవన్‌ను కాదని.. వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశారు. ఇది.. రెండు కుటుంబాల మధ్య తుఫాన్ రేపే అవకాశం ఉంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.