తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు నుంచి 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం (weather station) వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మంలో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వరంగల్, మెదక్, హన్మకొండ, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరో వైపు వాతావరణ శాఖ (Weather Update) అధికారులు రిపోర్ట్ ప్రకారం.. ఆగస్టు 3న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇవాళ ఏపీలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.