Paris Olympics, BJP MLA : పారిస్ ఒలింపిక్స్ బిజెపి ఎమ్మెల్యే.. ఏ ఈవెంట్ లో అంటే ?

పారిస్‌ ఒలింపిక్స్ ఉత్సాహంగా మొదలయ్యాయి. విశ్వక్రీడల్లో సత్తా చాటేందుకు భారత్‌ తరఫున ఈ సారి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు.

పారిస్‌ ఒలింపిక్స్ ఉత్సాహంగా మొదలయ్యాయి. విశ్వక్రీడల్లో సత్తా చాటేందుకు భారత్‌ తరఫున ఈ సారి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే కూడా పోటీ పడుతుండడం చాలామందికి తెలీదు. ఆమె |ఎవరో కాదు బిహార్ జముయ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసి సింగ్…. ఆమె షాట్‌గన్ ట్రాప్ ఉమెన్స్ ఈవెంట్‌లో పోటీపడుతున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన విజయ్ ప్రకాష్‌పై శ్రేయాసి సింగ్ దాదాపు 41 వేల ఓట్లతో మెజారిటీతో విజయం సాధించారు. శ్రేయసి సింగ్ వ్యక్తిగత వివరాలను చూస్తే ఆమె బిహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. శ్రేయసి తల్లి పుతుల్ సింగ్ కూడా బంకా స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు రాజకీయాల్లో రాణించడంతో.. ఆమె కూడా అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.

ఇటు రాజకీయాల్లో రాణిస్తూనే.. క్రీడల్లో కూడా సత్తా చాటుతున్నారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో శ్రేయాసి సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా స్వర్ణం కైవసం చేసుకున్నారు. 32 ఏళ్ల శ్రేయసి సింగ్‌కు 2018 సంవత్సరంలో ప్ర‌భుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. గత పదేళ్ళుగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న శ్రేయాస్ సింగ్ ఇప్పుడు ఆమె భార‌త్ కు ఒలింపిక్ మెడ‌ల్ అందించ‌మే ల‌క్ష్యంగా పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచారు.