తెలంగాణలో క్రమంగా నిత్యవసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక సారి నీవు.. మరో సారి నేను.. అన్నట్లుగా నిత్యావసరాల ధరలు అంతకంతకు కొండెక్కుతున్నాయి. మొన్నటి వరకు ఉల్లిగడ్డలు కన్నీళ్లు తెప్పించాయి. ఆ తర్వాత టమోటాలు బగ్గుమనిపించాయి. అంతటితో ఆగిందా.. నేనేం తక్కువ అన్నట్లు వెల్లుల్లి కూడా తన ప్రతాపం చూపించింది. ఇక ఈ ధరలతో సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి గుడ్డు కూడా రంగ ప్రవేశం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు కొండెక్కి కూర్చుంటూన్నాయి. గత నెలంతా కార్తీక మాసం కావడంతో చికెన్, గుడ్ల వంక చూసిందే లేదు. ఇక కోడి గుడ్డు ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఇక కార్తీక మాసం ముగిసింది. ఇప్పుడు తమ ప్రతపం చూపెడుతున్నాయి కోడి గుడ్లు. కార్తీక మాసం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 ఉండగా.. వారం కిందటా రూ.6కు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా రూ. 7 నుండి 8 రూ. పలుకుతోంది ఒక్కో కోడి గుడ్డు. ఇక కేవలం వారం రోజుల్లోనే డజన్ గుడ్ల ధర ఒక్కసారిగా రూ. 72 నుంచి 84 రూ.కు చేరింది. మరో వైపు హోల్ సేల్ లో ఒక్క గుడ్డు ధర రూ. 5.76 గా పలుకుతోంది.
ఇలా గుడ్లే కాదండోయ్.. చికెన్ సైతం ఇదే మార్గంలో పయనిస్తుంది. కార్తీక మాసంలో కిలో చికెన రూ. 150 నుంచి 180 వరకు పలకగా.. తాజాగా ఎంత పలుకుతుందో తెలుసా.? ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి 240 కి చేరుకుంది. దీంతో సామాన్యులు కొన్ని రోజులు మాసం ముటుకునేందుకు జంకుతున్నారు. మొన్నె న్యూ ఇయర్ ఈవెంట్స్ రావడంతో ప్రతి ఒక్కరూ బిర్యానీ లకు మొగ్గు చూపిన విషయం తెలిసిందే.. దీంతో దేశ వ్యాప్తంగా చికెన్ కు భారీ డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఇదే సరైన సమయం అని వ్యాపారుస్తులు భావించి ధరలు పెంచేశారు.
మళ్లీ చికెన్, కోడి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి.. ఎందుకు అంటారా.. మరో 10 రోజుల సంక్రాంతి పండుగ వస్తోంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో నాన్ వెజ్ వండుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అది కూడా ఎక్కుడగా అంటే సంక్రాంత్రికి చూట్టాలతో ఇంల్లు నిండటంతో ఒక్కోక్కరు రెండు, మూడేసి కేజీల చికెన్ కొనుగోలు చేస్తారు.