Vijayawada MP, Keshineni Nani : వైసీపీ ఫ్లైట్ ఎక్కబోతున్న కేశినేని నాని..?

బెజవాడ ఎంపీ సీటుపై దాదాపు ఏడాదిన్నర నుంచి నలుగుతున్న వ్యవహారానికి తెరదించింది టీడీపీ అధినాయకత్వం. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. నేరుగా చెప్పకున్నా.. ఆయన సోదరుడు చిన్నికి లైన్ క్లియర్ చేసింది. దీంతో ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నాని. దీంతో కొందరిలో రిలీఫ్ కనబడినా.. నాని స్వభావం తెలిసినవారు.. ఆయన్ను దగ్గరుండి చూసిన వారిలో మాత్రం భవిష్యత్తులో బాంబ్‌ బ్లాస్ట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బెజవాడ ఎంపీ సీటుపై దాదాపు ఏడాదిన్నర నుంచి నలుగుతున్న వ్యవహారానికి తెరదించింది టీడీపీ అధినాయకత్వం. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. నేరుగా చెప్పకున్నా.. ఆయన సోదరుడు చిన్నికి లైన్ క్లియర్ చేసింది. దీంతో ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నాని. దీంతో కొందరిలో రిలీఫ్ కనబడినా.. నాని స్వభావం తెలిసినవారు.. ఆయన్ను దగ్గరుండి చూసిన వారిలో మాత్రం భవిష్యత్తులో బాంబ్‌ బ్లాస్ట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలోనే ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కూడా నాని ప్రకటించేశారు.

విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చేది లేదని టీడీపీ చెప్పిన తర్వాత కేశినేని నాని చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. అలా చేసి ఉంటే రాజకీయాల్లో చాలా ఎదిగేవాడిని. ఢిల్లీ వెళ్ళేందుకు ఫ్లైట్లు చాలా ఉంటాయనీ.. ప్రస్తుతం టీడీపీ ఫ్లైట్‌ మాత్రమే మిస్‌ అయింది అన్న మాటల్లోని గూఢార్ధాల్ని వెదికే పనిలో ఉన్నాయి రాజకీయవర్గాలు. భవిష్యత్తులో కేశినేని నాని ఏం చేయబోతున్నారు..? అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన.. పార్టీకి, ఎంపీ పదవికి రిజైన్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి రిజైన్ చేసి ఊరుకుంటారా.. లేక కట్టు తెంచుకుని గళమెత్తుతారా..? అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా కన్పిస్తోంది. కేశినేని హిస్టరీ చూస్తే.. గతంలో పీఆర్పీ విషయంలో అనుసరించినట్టే.. సీన్‌ రిపీట్ చేసే అవకాశాలు లేకపోలేదనే చర్చ జోరుగా సాగుతోంది. పీఆర్పీని వీడి.. టీడీపీలో చేరుతున్నప్పుడు కేశినేని నాని.. చిరంజీవిపై సంచలన ప్రెస్‌ మీట్ పెట్టి.. ఉతికి ఆరేశారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ విషయంలోనూ అదే తరహా విధానం ఉంటుందేమోనన్న ఆందోళన పెరుగుతోంది. చంద్రబాబు హాజరయ్యే తిరువూరు సభ జరిగే ఏడో తారీఖునే నాని బాంబులు పేలుస్తారా..? అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయట. దీంతో ఆ బాంబులకు కౌంటర్‌గా ఇట్నుంచి స్కడ్‌ మిసైళ్లు ఎలా వేయాలనే దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది నాని వ్యతిరేక వర్గం.

ఇదే సందర్భంలో కేశినేని నాని మళ్లీ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారా.? లేదా..? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు వేరే మార్గాలు ఏమైనా వెతుక్కుంటున్నారా..? లేక స్పెషల్‌ ఫ్లైట్ సిద్దం చేసుకుంటున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో టీడీపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాల్లో కేశినేని నాని చాలా కామెంట్లు చేశారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న మాటలు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు నాని ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా..? లేక వేరే పార్టీలను ఏమైనా వెతుక్కుంటారా..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కేశినేని స్వభావాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం ఖాయమనేది ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ విషయంలో తన ఒక్కరికే పరిమితం అవుతారా..? లేక టీం కేశినేని అంటూ కొత్త రాజకీయానికి తెర లేపుతారా..? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే.. బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారే సూచనలు కన్పిస్తున్నాయి. తాను లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో పాటు.. బెజవాడ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లల్లోనూ తన అనుచరులను టీం కేశినేని బ్యానర్‌ మీద స్వతంత్రులుగా బరిలో దింపితే పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది. త్వరలోనే ఢిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తాననీ.. ఆ మరుక్షణమే టీడీపీకి రిజైన్ చేస్తానని ట్వీట్ చేశారు కేశినేని నాని. ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు కాస్త సైలెంట్ గా ఉన్నా.. ఎన్నికల నాటికి నాని వయొలెంట్‌గా