YCP, Third List : వైసీపీ మూడో జాబితా రెడీ.. ఈసారి ఎగిరిపోయే వికెట్లు ఇవే..

ఆరునూరైనా.. ఎంత దూరమైనా.. ఎట్టి పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకోవాలని ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు టీడీపీ, జనసేన కలిసి అడుగులు వేయబోతున్న వేళ.. వైసీపీ నుంచి ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉంది అనుకుంటే.. ఎంత పెద్ద లీడర్ అయినా.. ఎంత దగ్గరివాడైనా.. తీసి పక్కనపెట్టేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జిలను ప్రకటిస్తూ.. ఇప్పటికే రెండు జాబితాలు రిలీజ్ చేశారు.

ఇప్పుడు మూడో జాబితా కూడా రెడీ అయిందని తెలుస్తోంది. కరెక్ట్ టైమ్ చీసుకొని.. ఈ జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు. టికెట్ దొరికే అవకాశం లేదనుకున్న వారిని… నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించి జగన్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు, యువత.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా జగన్ ముందుకు వెళ్తున్నారు. మూడో జాబితాలో 25మంది నియోజకవర్గ ఇన్చార్జిల పేర్లను జగన్ ప్రకటించనున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను అనౌన్స్‌ చేయబోతున్నారు. రాయదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు రామచంద్రా రెడ్డికి టికెట్ కష్టమే అని క్లారిటీ రావడంతో.. ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.

దీంతో రాయదుర్గం అసెంబ్లీకి ఎవరిని ఇంచార్జిగా నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోనూ మార్పులు చేసే చాన్స్ ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. టికెట్ రాకపోతే.. ఆయన కూడా వైసీపీని వీడే ఆలోచన చేస్తున్నారని టాక్. మొదటి రెండు జాబితాల్లో మార్పులు రేపిన అలజడి అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు మూడో జాబితా ఎలాంటి సంచలనాలకు కేరాఫ్‌గా మారుతుంది.. వైసీపీ బాస్‌కు ఇంకా షాక్‌లు తగిలే చాన్స్ ఉందా అనే ప్రచారం ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.