పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్ రిజైన్ చేస్తారన్న టాక్ బాగా నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో… అవమానాలు తట్టుకోవడం కష్టమని అసెంబ్లీలోకి అడుగుపెట్టొద్దని జగన్ డిసైడ్ అయ్యారట. అదే టైమ్ లో ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డితో రిజైన్ చేయించి… ఉపఎన్నికల్లో అక్కడ నిలబడాలని జగన్ ఆలోచిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కానీ కడప ఎంపీ పదవిని అవినాష్ రెడ్డి వదులుకోవడం అంత ఈజీగా కాదంటున్నారు నిపుణులు. అయితే అసలు జగన్ ఎంపీగా నిలబడే చాన్సే లేదని కూడా వైసీపీ లీడర్లు చెబుతున్నారు.
పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్ రిజైన్ చేసి…అక్కడ విజయమ్మని లేదా వైస్ భారతిని నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు నడుస్తున్నాయి. అసలు వైఎస్సార్ జయంతి రోజునే జగన్ ప్రకటిస్తారని అన్నారు. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. ఎమ్మెల్యేగా రిజైన్ చేసి కడప ఎంపీగా జగన్ పోటీ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవడం కష్టమే అన్న టాక్ కూడా నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండటంతో అధికార పార్టీకే జనం ఓట్లేసే ఛాన్సుంది. అదీకాకుండా… అసలు కడప ఎంపీ పదవిని అవినాష్ వదులుకోడానికి ఇష్టం లేనట్టు తెలుస్తోంది. వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ పదవి రక్షణ కవచంలాగా ఉపయోగపడుతోంది. పదవి వదులుకుంటే తాను అరెస్ట్ అవడం ఖాయమని అవినాష్ రెడ్డి భయపడుతున్నట్టు తెలుస్తోంది. జగన్ కూడా ఎంపీ పదవిలోకి దూరి… ఢిల్లీ స్థాయిలో తన కేసులపైన పైరవీలు చేసుకోవచ్చని అనుకుంటున్నారు.
పులివెందుల అసెంబ్లీ స్థానంలో విజయమ్మ నిలబెట్టి… జగన్ ఎంపీగా పోటీ చేయడాన్ని షర్మిల కూడా ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. అవినాష్ రెడ్డిని పక్కనబెట్టాలని షర్మిల, సునీత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అందుకే చెల్లెమ్మలతో తెగిన బంధాన్ని అతుకు పెట్టుకోడానికి కూడా అవినాష్ రెడ్డితో రిజైన్ చేయించాలని జగన్ చూస్తున్నట్టు సమాచారం. అవినాష్ రెడ్డికీ, జగన్ కీ ఎంపీ పదవి కీలకం కావడంతో… ఇద్దరూ ఏం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. అవినాష్ రిజైన్ కి ఒప్పుకోకపోతే జగన్ ఏం స్టెప్ తీసుకుంటారన్న దానిపై చర్చ నడుస్తోంది. కానీ జగన్ ఎంపీగా నిలబడే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అదంతా టీడీపీ లీడర్లు చేస్తున్న ప్రచారమని కొట్టిపారేస్తున్నారు.