Pawan Kalyan : సెక్రటేరియట్‌లో పవన్‌ చాంబర్‌ ఇదే.. ఏర్పాట్లు మామూలుగా లేవుగా!

ఏపీ ఎన్నికల్లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎవరూ అంటే అంతా యునానిమస్‌గా చెప్పే పేరు జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ (Pawan Kalyan) కూటమి గెలుపులో అంత కీలక పాత్ర వహించాడు కాబట్టే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి వర్గంలో అంత ప్రధాన్యత పవన్‌కు కల్పించారు చంద్రబాబు.

 

 

 

ఏపీ ఎన్నికల్లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎవరూ అంటే అంతా యునానిమస్‌గా చెప్పే పేరు జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ (Pawan Kalyan) కూటమి గెలుపులో అంత కీలక పాత్ర వహించాడు కాబట్టే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి వర్గంలో అంత ప్రధాన్యత పవన్‌కు కల్పించారు చంద్రబాబు. డిప్యుటీ సీఎం (Deputy CM) తో పాటు 6 కీలక శాఖలను పవన్‌కు కేటాయించారు. మంత్రివర్గ విస్తరణ పూర్తి అవ్వడంతో సెక్రటేరియట్‌లో ఛాంబర్‌ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు అధికారులతో భేటీ అయ్యారు. అయితే, మిత్ర పక్షం జనసేన ఆత్మగౌరవం దెబ్బతినకుండా చంద్రబాబు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఈ క్రమంలోనే.. తన బ్లాక్‌లోనే పవన్‌కు ఓ చాంబర్‌ను కేటాయించాలని చంద్రబాబు (Chandrababu) భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌కు హై సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో మొదటి బ్లాకులోనే కేటాయించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం, మంత్రులకు 2, 3, 4, 5 బ్లాక్‌లలో చాంబర్లు ఉండేవి. సీఎం, సీఎస్‌లకు మాత్రమే మొదటి బ్లాక్‌లో చాంబర్‌లు ఉండేది. ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రెటరీలు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇలా బ్లాక్‌లు ఏర్పాటు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ట్రెండ్‌ మారింది.

ఏపీ ప్రభుత్వం (AP Government) లో ముఖ్యమంత్రికి ఎలాంటి ఇంపార్టెన్స్‌ ఉందో.. ఇప్పుడు డిప్యుటీ సీఎం పవన్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేశారు చంద్రబాబు. దీంతో భవిష్యత్తులో కూడా టీడీపీ జనసేన మధ్య ఎలాంటి విభేదాలు వచ్చే ప్రమాదం లేకుండా ఇప్పటి నుంచే పక్కాగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో జనసేన కేడర్‌లో ఫుల్‌ జోష్ వచ్చింది. తమ అధినేత సీఎం కుర్చీలో కూర్చోకపోయినా.. అధికారంలో దాదాపు అదే స్థాయిలో ఉండటంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.