AP Politics : బాబు, పవన్ ను తిడితేనే టిక్కెట్లా ? వైసీపీ అభ్యర్థులకు కొత్త చిక్కులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నడూ లేనంతగా గత పదేళ్ళుగా చాలామంది పొలిటికల్ లీడర్లు (Political Leaders) తిట్లతోనే బతికేస్తున్నారు. ప్రతి రోజూ మీడియాలో ప్రత్యక్షమై.. బూతులు తిడుతూ రికార్డులు సాధిస్తున్నారు. గతంలో ఏ వ్యక్తిపై అయినా పార్టీ పరంగా మాత్రమే విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడైతే కుటుంబ సభ్యులను కూడా వివాదాల్లోకి లాగి మరీ తిడుతున్నారు. ఇందులో సీఎం జగన్ కూడా ముందు ఉంటున్నారు.

 

 

 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నడూ లేనంతగా గత పదేళ్ళుగా చాలామంది పొలిటికల్ లీడర్లు (Political Leaders) తిట్లతోనే బతికేస్తున్నారు. ప్రతి రోజూ మీడియాలో ప్రత్యక్షమై.. బూతులు తిడుతూ రికార్డులు సాధిస్తున్నారు. గతంలో ఏ వ్యక్తిపై అయినా పార్టీ పరంగా మాత్రమే విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడైతే కుటుంబ సభ్యులను కూడా వివాదాల్లోకి లాగి మరీ తిడుతున్నారు. ఇందులో సీఎం జగన్ కూడా ముందు ఉంటున్నారు. పవన్ కల్యాన్ భార్యలపై ఆయన ప్రతి మీటింగ్ లోనూ కామెంట్ చేస్తూనే ఉన్నారు. మొన్నటి వైసీపీ (YCP) ఇంఛార్జుల మార్పులో కూడా తిట్లు తిట్టే వారికే ప్రాధాన్యత ఇచ్చారట. ఇదేదో చంద్రబాబు చేసిన విమర్శ కాదు.. ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలే చెబుతున్నారు. పైగా అదుగో.. మీ జిల్లాలో ఆ లీడర్ తిట్టినట్టు.. నువ్వు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ని తిట్టలేదు. అందుకే నీకు టిక్కెట్ ఇవ్వడం లేదని డైరెక్ట్ గా జగన్ చెప్పినట్టు టాక్ నడుస్తోంది. లేటెస్ట్ గా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పార్థసారధి (Parthasaradhi) టిక్కెట్టు ఇవ్వడం లేదని సీఎం జగన్ పది రోజుల క్రితమే తేల్చి చెప్పారు. అయితే తాను మాత్రం పెనమలూరు నుంచి పోటీ చేసి తీరతానని పట్టుదలగా ఉన్న ఆయన టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. పార్థసారధి జగన్ ను కలిసినప్పుడు.. తాము ఎన్నిసార్లు బూతులు తిట్టమని చెప్పినా తిట్టలేదనీ.. అందుకే నీకు టిక్కెట్ ఇవ్వట్లేదని తాడేపల్లికి పిలిపించి మరీ చెప్పారట జగన్. మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పోల్చి.. చంద్రబాబు, పవన్ ను ఆయనే ఎక్కువగా తిట్టారు.. మీరు అలా చేయకపోవడంతోనే నాకు దూరమయ్యారని జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

అసలు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ బూతుల చిత్రం బయటకు వచ్చింది. వైసీపీ ప్లీనరీలో మాట్లాడేందుకు రోజా మైక్ సర్దుకుంటుండగా.. సీనియర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెళ్ళి.. చంద్రబాబును బాగా తిట్టమని జగన్ చెప్పారు. అని అన్నారట. అప్పటికే మైక్ ఆన్ లో ఉండటంతో ఈ సంగతి సభకు వచ్చిన వాళ్ళందరికీ వినిపించింది. ఆ మీటింగ్ లో రోజా చెలరేగి పోయి చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు. ఆ తర్వాత అదే తరహాలో విజయసాయి రెడ్డి కూడా తయారయ్యారు. ఆయనో ఛార్టెడ్ అకౌంటెంట్ అయినా.. ఆయన మాట్లాడే మాట తీరు, ట్వీట్స్ ఘోరంగా ఉంటాయని అంటారు. జోగి రమేష్ కు మంత్రి పదవి రావడానికి కూడా బూతులే కారణమని చెబుతారు. కాని అందరి కంటే బాబును ఎక్కువగా తిట్టిన కొడాలి నానికి మంత్రి పదవికి ఎందుకు రాలేదని డౌట్.

ఇప్పుడు లేటెస్ట్ గా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా అదే చెబుతున్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికి పనిచేశా. కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ను తిట్టడం తనకు రాదనీ.. అందుకే ఈసారి వైసీపీ టిక్కెట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. వైసీపీలో ప్రతిపక్ష నేతలను పచ్చి బూతులు తిట్టే వారికే పదవులు, సీట్లు ఇస్తారని ఎద్దేవా చేశారు రక్షణ నిధి. ఈమధ్య టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. తనను తిట్టిన వారికే వైసీపీలో పదవులు, టిక్కెట్లు దక్కుతాయని అంటున్నారు. దాంతో వైసీపీలో టిక్కెట్టు రావాలంటే.. బూతులు తిట్టాలా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లీడర్లు మాట్లాడుతున్న బూతులు వింటుంటే.. జనం చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అంత ఘోరంగా ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో అయినా.. ఏపీ రాజకీయాల్లో డర్టీ పాలిటిక్స్ ని బంద్ చేయాలని జనం కోరుకుంటున్నారు.