డిసెంబర్ నెలలో కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం 100 కోట్లు దాటింది. వరుసుగా 22 నెలల నుంచి ప్రతి నెల స్వామివారి ఆదాయం 100 కోట్ల దాటి పోతోంది. గడచిన డిసెంబర్ నెలలో శ్రీవారి ఉండి ఆదాయం 116 కోట్ల రూపాయలు వచ్చింది.2023 సంవత్సరంలో తిరుమల శ్రీవారి హుండీ ద్వారా 1398 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇది కేవలం హుండీలో భక్తులు వేసిన సొమ్ము మాత్రమే. కిందటేడు జూలైలో అత్యధికంగా 129 కోట్ల రూపాయల ఆదాయం హుండీ ద్వారా వచ్చింది. అలాగే నవంబర్లో అత్యల్పంగా 108 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. అంటే ఎలా చూసినా స్వామివారి ఆదాయం రోజుకు అటు ఇటుగా నాలుగు కోట్లు రూపాయలు వస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తూ ఉంటారు. ధనిక పేద తారతమ్యాలు లేకుండా అందరూ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక పండగలు , సెలవు రోజుల్లో స్వామి దర్శనం కోసం జనం పోటీ ఎత్తుతారు. భక్తితో మొక్కులు చెల్లించుకుంటారు. గడచిన 20 యేళ్ళల్లో తిరుమల మరింత బాగా అభివృద్ధి చెందడం, భక్తులకు సౌకర్యాలు కూడా మెరుగవడంతో వచ్చేవాళ్లు సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం ఏనాడూ లేదు. అలాగే స్వామివారికి మొక్కులు చెల్లించే విషయంలో జనం ఎక్కడ రాజీపడరు. అందరూ ప్రేమతో ఇచ్చేవాళ్లే. ప్రతిరోజు రూపాయి రూపాయి పోగేసి ఏడాదికోసారైనా ముడుపు కట్టి ఆ చిల్లర తీసుకెళ్లి స్వామివారి హుండీలో వేసి సంబరపడిపోయే భక్తులు కోట్లమంది.
Rs 100 NOTES: పాత రూ.100 నోట్లు రద్దవుతాయా.. ఆర్బీఐ ఏం చెప్పింది..?
ఒక రహస్య భక్తుడు కోటి రూపాయలు తీసుకొచ్చి స్వామివారి హుండీలో వేస్తే ఒక రోజు కూలి తాను దాచుకున్న రూపాయి నాణాన్ని తీసి కూడా శ్రీవారి ఈ కానుక ఇస్తాడు. అవి ఇవి అన్నీ కలిసి శ్రీవారి ప్రతిష్టాత్మక ఆదాయాన్ని నెలకు 100 కోట్లు దాటించింది. 2023లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఎంతమందో తెలుసా రెండు కోట్ల 50 లక్షల పైచిలుకు. ప్రపంచంలో ఏ పుణ్యక్షేత్రానికి ఇంతమంది జనం వచ్చింది లేదు. అంతేకాదు కాలమానాలతో సంబంధం లేకుండా, వాతావరణం తో సంబంధం లేకుండా ఏడాది 12 నెలలు జనం వచ్చింది కూడా ఈ పుణ్యక్షేత్రానికే. ఇటీవలే ప్రధాని మోడీ కూడా తిరుమలకు వచ్చి వెళ్లారు. గడచిన పదేళ్ళల్లో మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగో సారి. చిత్రమైన విషయం ఏంటంటే మోడరన్ లైఫ్ లో మమేకమైపోతున్న యూత్ కూడా తిరుమల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకుండా ఉండలేరు. ఎన్నారైలు ఎక్కువగా వచ్చి దర్శించుకునే పుణ్యక్షేత్రం కూడా తిరుమలే. శ్రీ వెంకటేశ్వరుని మహిమ వల్లేమో తిరుమలగిరిలు కూడా ఏ ఏటికి ఆ ఏడు మరింత సౌభాగమానంగా మారుతున్నాయి. సహజంగా పుణ్యక్షేత్రాలు లో శుభ్రత ఉండదు. కానీ భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలకి తిరుమల చాలా భిన్నం. బహుశా వెంకన్న మహిమ వల్లనేమో తిరుమల ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. రోజంతా అక్కడ ఉన్న వెళ్లిపోయే టైంలో అప్పుడే వెళ్ళిపోవాల్సి వచ్చిందా భక్తులు బాధపడతారు. ఒకప్పుడు తో పోల్చుకుంటే తిరుపతికి విమాన సర్వీసులు, ఇతర ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కూడా బాగా పెరగడంతో తిరుమలకు వచ్చి పోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోడ్ సర్వీసులు కూడా మెరుగవడంతో తమిళనాడు ,కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. హుండీ ఆదాయం తో పాటు… శ్రీ వెంకటేశ్వర స్వామి కున్న రకరకాల ఆస్తులు వాటి నుంచి వచ్చే వార్షిక ఆదాయం తో టీటీడీ వివిధ రకాల అభివృద్ధి పనులు, ఆలయాల నిర్వహణ, వేద పాఠశాలలు, హైందవ సంస్కరణ కార్యక్రమాలు చేయగలుగుతుంది. వీటన్నిటి వెనక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు కొనసాగుతూనే ఉంటాయి