TTD: శ్రీవారి దర్శనం.. జనవరి 2 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..

తిరుపతిలోని కౌంటర్లలో జనవరి రెండో తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్లను జనవరి 2, ఉదయం 4 గంటల నుంచి విడుదల చేయనున్నారు.

  • Written By:
  • Updated On - December 31, 2023 / 07:29 PM IST

TTD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సంగతి తెలిసిందే. దీనికోసం డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1 వ‌ర‌కు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సర్వ దర్శన టోకెన్లు జారీ చేసింది. అయితే, అవి డిసెంబర్ 25న ఉద‌యం 4.27 గంట‌ల‌కే పూర్తయ్యాయి. ఇప్పుడు వైకుంఠ ద్వారా దర్శనం పూర్తి కానుండటతో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయబోతుంది టీటీడీ.

TS INTER EXAMS: ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం

తిరుపతిలోని కౌంటర్లలో జనవరి రెండో తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్లను జనవరి 2, ఉదయం 4 గంటల నుంచి విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయి. భక్తులు ఈ విషయం గమనించి సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకు కూడా.. ఇకపై శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.

హోమం టికెట్‌ కాకుండా రూ.300 అదనంగా చెల్లించిన వారికి సుపథం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును కల్పిస్తామన్నారు. మరోవైపు.. తిరుపతి వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనవరి 6, 7 తేదీల్లో శ్రీసద్గురు త్యాగరాజ స్వామివారి సంగీత మహోత్సవాలు నిర్వహిచబోతున్నట్లు వెల్లడించారు. రామచంద్ర పుష్కరణిలో అంతర్జాతీయ కచేరి జరుగనుంది.