YS Sharmila : వైసీపీ మంత్రి కోసం రెండు సీట్లు.. షర్మిలకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా..

ఏపీ పీసీసీ చీఫ్‌ (AP PCC chief) గా బాధ్యతలు అందుకున్న షర్మిల (Sharmila) .. తగ్గేదే లే అంటున్నారు. పగ్గాలు అందుకున్న రోజు కాస్త పర్వాలేదనిపించిన షర్మిల మాటలు.. జగన్‌ టార్గెట్‌గా రోజురోజుకు ఘాటెక్కుతున్నాయ్. వైసీపీ (YCP) కూడా దీటుగా కౌంటర్ ఇస్తోంది అది వేరే విషయం. షర్మిలను వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారో.. ఐడియాలు ఎవరిస్తున్నారో కానీ.. ఆమె ఐడియాలు మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయ్.

ఏపీ పీసీసీ చీఫ్‌ (AP PCC chief) గా బాధ్యతలు అందుకున్న షర్మిల (Sharmila) .. తగ్గేదే లే అంటున్నారు. పగ్గాలు అందుకున్న రోజు కాస్త పర్వాలేదనిపించిన షర్మిల మాటలు.. జగన్‌ టార్గెట్‌గా రోజురోజుకు ఘాటెక్కుతున్నాయ్. వైసీపీ (YCP) కూడా దీటుగా కౌంటర్ ఇస్తోంది అది వేరే విషయం. షర్మిలను వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారో.. ఐడియాలు ఎవరిస్తున్నారో కానీ.. ఆమె ఐడియాలు మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయ్. ఓవైపు జగన్‌ను (CM Jagan) టార్గెట్‌ చేస్తూనే.. మరోవైపు వైసీపీ నుంచి వైఎస్ఆర్‌ సెంటిమెంట్‌ దూరం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. సజ్జల, వైవీ, విజయసాయి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైసీపీలో ఉంది ఆ ముగ్గురే.. వైఎస్‌ఆర్ లేరు అంటూ కొత్త ప్రచారం అందుకున్నారు.

వైఎస్‌ లక్షణాలే రాలేదు అన్నట్లుగా జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు షర్మిల. ఇలా అధికార పార్టీ మీద మాటలు సంధిస్తూనే.. ఆర్టీసీ బస్సు ప్రయాణాలు, జనాలతో పలకరింపులులాంటి కార్యక్రమాలతో.. కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. అదే సమయంలో పార్టీలో చేరికల మీద కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆళ్ల వచ్చారు. వైసీపీలో టికెట్‌ దక్కని వాళ్లు వీళ్లు కూడా.. కాంగ్రెస్‌ వైపు చూసేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఇప్పుడు ప్రచారం మాత్రం.. ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ సీనియర్ మంత్రి కుటుంబానికి.. కాంగ్రెస్‌లో రెండు టికెట్లు రిజర్వ్ అయినట్లు.. వాటిని షర్మిల రిజర్వ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇంచార్జిల మార్పులో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరాం.. ఈసారి నియోజకవర్గం మారాల్సి వచ్చింది. ఆయనను ఈసారి ఆలూరు అసెంబ్లీ సీటు నుంచి కాకుండా కర్నూలు ఎంపీ సీటులో పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. దీనికి ముందు సరే అన్నట్లు కనిపించిన జయరాం.. ఆ తర్వాత టోన్ మార్చారు. జగన్‌తో ఫైనల్‌గా చర్చించినా ఫలితం లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అలూరు అసెంబ్లీ స్ధానంలో తిరిగి పోటీకి జయరాంకు టికెట్ లేదని ముందే సంకేతాలు వచ్చేశాయి. దీంతో ఆయన తనకు సన్నిహితుడైన కర్నాటక కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టారు. చివరికి కర్నూలు ఎంపీ సీటులో అయితే ఓకే అని జగన్ చెప్పేశారు.

జయరాంకు కర్నూలు ఎంపీ సీటులో పోటీ చేసినా ఫలితం ఎలా ఉంటుందో తెలియని పరిస్ధితి. దీంతో చివరకు ఆయన మంత్రి నాగేంద్ర సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల వర్గంతో చర్చలు జరపడంతో జయరాంతో పాటు ఆయన కుమారుడికి కూడా సీట్లు కేటాయించేందుకు సిద్ధమయ్యారట. మరి జయరాం నిజంగా కాంగ్రెస్‌లోకి వస్తారా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ చేస్తారా అన్న సంగతి పక్కనపెడితే.. షర్మిల కాన్ఫిడెన్స్ మాత్రం పీక్స్‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.