పవన్‌కు.. ఒకే రోజు రెండు షాక్‌లు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పవన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. గుర్తు వ్యవహారం గుబులు రేపుతుంటే.. పొత్తులు ఆ తర్వాత పరిణామాలతో కార్యకర్తల్లో అసంతృప్తి మరింత టెన్షన్ పెడుతోంది. వీటికితోడు నేతల వరుస రాజీనామాకు పవన్‌ను మరింత ఇబ్బంది పెడుతన్నాయ్.

 

 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పవన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. గుర్తు వ్యవహారం గుబులు రేపుతుంటే.. పొత్తులు ఆ తర్వాత పరిణామాలతో కార్యకర్తల్లో అసంతృప్తి మరింత టెన్షన్ పెడుతోంది. వీటికితోడు నేతల వరుస రాజీనామాకు పవన్‌ను మరింత ఇబ్బంది పెడుతన్నాయ్. విజయవాడలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్‌.. జనసేనకు (Janasena) రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్.. ఈసారి టికెట్ ఆశించారు. ఐతే పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ స్థానం.. బీజేపీ (BJP) కి ఇచ్చారు. అక్కడి నుంచి సుజనా చౌదరి (Sujana Chaudhary) బరిలో దిగబోతున్నారు. ఐతే చివరి వరకు టికెట్ మీద ఆశలతో కనిపించిన పోతిన మహేష్..

ఇక రాదు అని ఫిక్స్ అయి జనసేనకు గుడ్‌బై చెప్పారు. వెళ్తూ వెళ్తూ జనసేన మీద, పవన్ మీద ఘాటు విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేశారు కూడా ! పవన్‌ది అంతా యాక్టింగ్ అని.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే పోతిన మహేష్ రాజీనామా, ఆయన మాటల నుంచి తేరుకోకముందే.. జనసేనకు ఇంకో షాక్ తగిలింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీవీ రావు.. జనసేనకు బైబై చెప్పేశారు. పార్టీ కోసం ఇన్నేళ్లుగా పనిచేస్తే మిగిలిందేమీ లేదనే ఆవేదనతో పవన్‌కు సందేశం పంపించారు. కైకలూరు టికెట్‌ను కూడా పొత్తులో భాగంగా బీజేపీకే కేటాయించారు.

ఇక్కడి నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కైకలూరులో జనసేన లేకుండా చూడాలని కామినేని ప్రయత్నిస్తున్నారని.. పవన్‌ నుంచి కనీసం పిలుపు అయినా వస్తుందనుకుంటే.. అదీ జరగలేదని బీవీ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీని వీడారు. జనసేనకు కీలకం అయిన రెండు నియోజకవర్గాల్లో.. నాయకులు వరుసగా పార్టీకి బైబై చెప్పడం పవన్‌కు షాక్‌గా మారడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.