Vemireddy Resign : వైసీపీకి వేమిరెడ్డి రాజీనామా… రెండు ఆఫర్లు ఇచ్చిన టీడీపీ !

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో వైసీకి కీలకంగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రిజైన్ చేశారు. ఆయన భార్య ప్రశాంతితో కలసి ఈనెల 23న టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి రాజీనామా చేశారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశం తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 04:06 PM IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో వైసీకి కీలకంగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రిజైన్ చేశారు. ఆయన భార్య ప్రశాంతితో కలసి ఈనెల 23న టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి రాజీనామా చేశారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశం తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై కొట్టారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళిపోతుండటంతో జిల్లా వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.

నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వైసీపీకి రిజైన్ చేశారు. తన రాజీనామా లెటర్ ను పార్టీ అధిష్టానానికి పంపారు. అధినేత జగన్ తో విభేదాల కారణంగా గత నెల రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు వేమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 2019లో 10 సీట్లు గెలిపించడంలో వేమిరెడ్డిదే కీలక పాత్ర. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ని ఈసారి నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. వేమిరెడ్డి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. కానీ తన ఎంపీ నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి సూచనలు చేశారు. నెల్లూరు సిటీ ..కావలి.. ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చాలని అధిష్టానాన్ని కోరారు. కానీ అందుకు జగన్ ఒప్పుకోలేదు. దాంతో మనస్థాపం చెందారు వేమిరెడ్డి. ఆయన్ని బుజ్జగించేందుకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయనీ… నెల్లూరు లోక్‌సభ పరిధిలో జరిగే పరిణామాలపై కనీసం సమాచారం కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు వేమిరెడ్డి. నెల రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కొన్నిరోజులుగా చెన్నైలోనే మకాం పెట్టిన ఆయన… బుధవారం నెల్లూరులో తన అనుచరులతో సమావేశమయ్యారు.

Gorantla Butchaiah Chowdary: ఎన్టీఆరే కారణమా..? ఎన్టీఆర్‌ మీద కోపంతోనే గోరంట్లపై వేటు వేశారా?
వైసీపీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అనుచరులకు వివరించారు. కొందరు వైసీపీ ముఖ్యనేతలు పార్టీలో ఉంచడానికి లాస్ట్ మినట్ ప్రయత్నాలు చేశారు. అభ్యర్దుల విషయంలో జగన్ తో మరోసారి చర్చించాలని సూచించారు. కానీ వేమిరెడ్డి మాత్రం వైసీపి రిజైన్ చేశారు. ఆయన భార్య ప్రశాంతి కూడా టీటీడీ బోర్డుకు రాజీనామా చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఈనెల 23న టీడీపీలో చేరతారని తెలుస్తోంది. వీళ్ళతో పాటు కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో చేరుతున్నారు. నెల్లూరు లోక్ సభ సీటును వేమిరెడ్డికి, ఎమ్మెల్యే సీటు ఆయన భార్య ప్రశాంతికి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్టు చెబుతున్నారు.