ఒకదాని తర్వాత ఒకటి.. ఒకదానికి మించి ఒకటి.. జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ప్రతిపక్ష హోదా దక్కలేదన్న అవమానం వెంటాడుతున్న వేళ.. గత ప్రభుత్వంలో మంత్రుల బాగోతాలను చంద్రబాబు సర్కార్ బయటకు తీస్తోంది. ఇక అటు అరెస్ట్‌ల వ్యవహారం కూడా స్టార్ట్ అయింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఇక అటు గెలిచిన 11మంది ఎమ్మెల్యేల్లో చాలామంది జంపింగ్ జపాంగ్ అనేందుకు రెడీ అవుతున్నారు.
ఇలాంటి పరిణామాల మధ్య.. షర్మిల ఇప్పుడు జగన్‌ను మరింత భయపెడుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి వైసీపీ ఘోర పరాభవంలో షర్మిల పాత్ర కూడా ఉంది. కంచుకోటలాంటి రాయలసీమలోనూ వైసీపీ సత్తా చాటలేకపోయింది అంటే.. దానికి ప్రధాన కారణం షర్మిలనే ! ఇలాంటి పరిణామాల మధ్య.. వైసీపీని టోటల్‌గా కబ్జా చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారు.. దానికి తల్లిని ఆయుధంగా వాడుకోబోతున్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది. వైఎస్ జయంతి వేడుకల నుంచే ఈ ప్లాన్‌ను అమల్లోకి తీసుకురాబోతున్నారనే టాక్ నడుస్తోంది.
ఈ వేడుకలకు కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు తల్లి విజయమ్మను కూడా ఆహ్వానిస్తున్నారు షర్మిల. ఐతే విజయమ్మ వస్తే జగన్‌కు భారీ షాక్ తప్పదా అంటే అవును అనే సమాధానమే వినిపిసతోంది. షర్మిల నిర్వహించే వైఎస్ జయంతి కార్యక్రమం సక్సెస్ అయితే.. వైసీపీ మనుగడకే ప్రమాదమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి, వైఎస్ సతీమణి విజయమ్మ పాల్గొంటే.. వైసీపీకి అది పెద్ద దెబ్బగా మారడం ఖాయం. తాను వైసీపీకి కాదు కాంగ్రెస్‌కే మద్దతు పలుకుతున్నానని విజయమ్మ చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. అదే జరిగితే.. వైసీపీకి పూర్తిగా స్వీప్ కావడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
నిజానికి కొంతకాలంగా షర్మిలకే విజయమ్మ మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్నికల సమయంలో అమెరికా వెళ్లిపోయిన ఆమె.. అక్కడి నుంచి షర్మిల కోసం ఓ వీడియో రిలీజ్ చేశారు. షర్మిలను గెలిపించాలని కోరారు. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అలాంటిది ఇప్పుడు.. కాంగ్రెస్ నిర్వహించే వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొంటే.. వైసీపీని కాదు కాంగ్రెస్ బలపరచాలని ఆమె పరోక్షంగా మెసేజ్ ఇచ్చినట్లే ! అదే జరిగితే వైసీపీ ఎండ్‌కు బీజం పడినట్లే అనే టాక్ వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య విజయమ్మ ఆ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.