VIVEKA VIDEOS : బాబుతో ఆడుకుంటున్న వివేకా.. ఆ వీడియోలు మళ్ళీ రిలీజ్

దివంగత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయనకు రెండో భార్య ఉందని చెప్పేందుకు అవినాష్ వర్గం ప్రయత్నిస్తోంది.

 

దివంగత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయనకు రెండో భార్య ఉందని చెప్పేందుకు అవినాష్ వర్గం ప్రయత్నిస్తోంది. ఎన్నికల వేళ ఈ వివాదంతో కడపలో తనకు డ్యామేజీ తప్పదని గ్రహించిన అవినాష్ రెడ్డి… వివేకాను హత్య చేసింది ఆయన ఫ్యామిలీయే అని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి చుట్టూ ఏపీ రాజకీయాలు (AP Politics) తిరుగుతున్నాయి. కడప (Kadapa) లోక్ సభ నియోజకవర్గం నుంచి మళ్ళీ వైసీపీ (YCP) కేండిడేట్ గా నిలబడ్డారు అవినాష్ రెడ్డి. అయన్ని ఎలాగైనా ఓడించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు వివేక కుమార్తె సునీత. షర్మిలతో కలసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ అవినాష్ తో పాటు జగన్నీ ఏకిపారేస్తున్నారు. ప్రెస్ మీట్స్, PPT లతో అవినాష్ నేరం చేశాడని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. తన చిన్నాన్నను చంపినవాళ్ళకే అన్న జగన్ ఆశ్రయం ఇస్తున్నాడని కడప సహా రాయలసీమ ఎలక్షన్ ప్రచారంలో షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలతో బేజారెత్తిన అవినాష్ వర్గం కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.

సునీతకు వ్యతిరేకంగా వైఎస్ వివేకాకు రెండో కాపురం ఉందని నిరూపించే వీడియోలను రిలీజ్ చేసింది ప్రత్యర్థి వర్గం. ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకొని బిడ్డను కన్నాడంటూ అవినాష్ రెడ్డి వర్గం వాదిస్తోంది. ఆస్తుల కోసం కుటుంబ సభ్యులే వివేకాను హత్య చేశారని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy)… మహిళ, ఓ బాబుతో కలసి ఉన్న పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలోకి వదిలారు. ఇందులో బాబుతో వివేకా, మహిళ కలసి ఆడుకుంటున్నారు. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. షర్మిల, సునీత విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈ వీడియోలు వదులుతున్నట్టు అర్థమవుతోంది. ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్ని బయటకు వస్తాయో తెలీదు.

ఓవైపు సునీత, షర్మిల్ వీడియోలతో టెన్షన్ పడుతున్న వైసీపీకి కోర్టులో వివేక హత్య కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో తెలియని పరిస్థితి. అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ (CBI) , సునీత తరపు న్యాయవాది ఈమధ్యే కోర్టులో వాదించారు. ఆయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారనీ.. కేసు విచారణ సరిగా జరగదని సునీత న్యాయవాది ఆర్గ్యూ చేశారు. దీనిపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికల్లోపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయితే పరిస్థితి ఏంటి వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.