YS Sharmila VS CM Jagan : షర్మిల విషయంలో జగన్ చేసిన తప్పేంటి?

మొండితనం ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister) జగన్ (CM Jagan) ప్లస్ పాయింట్. ఆ మొండితనంతోనే ఆయన పాలిటిక్స్ (Politics) లో సక్సెస్ చూశారు. కానీ ఒకసారి ప్లస్ అయిన విషయం ప్రతిసారి అవ్వాలని లేదు. జగన్ మొండితనం ఇప్పుడు ఆయనకు షర్మిల విషయంలో మైనస్ కూడా అయింది.

మొండితనం ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister) జగన్ (CM Jagan) ప్లస్ పాయింట్. ఆ మొండితనంతోనే ఆయన పాలిటిక్స్ (Politics) లో సక్సెస్ చూశారు. కానీ ఒకసారి ప్లస్ అయిన విషయం ప్రతిసారి అవ్వాలని లేదు. జగన్ మొండితనం ఇప్పుడు ఆయనకు షర్మిల విషయంలో మైనస్ కూడా అయింది. చెల్లెలితో ఇంటి గొడవని పరిష్కరించుకోలేకపోవడం, ఆమెతో మొండిగా వ్యవహరించడంతో… షర్మిల ఎప్పుడు జగన్ కు ఏకు మేకై కూర్చుంది. ఇంటి పరువు వీధిన పడటమే కాకుండా షర్మిల, జగన్ ల అధికార దాహం చివరికి. …రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొట్టింది.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు… ఈ నానుడి జగన్, షర్మిల ఇద్దరికీ వర్తిస్తుంది. రాజశేఖర్ రెడ్డి… కుమారుడు జగన్, కుమార్తె షర్మిల దేశభక్తులు ఏం కాదు. వాళ్లది దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబ అంతకంటే కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాజకీయ కుటుంబం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంచివాడు గాను, చనిపోయాక మహా నేత గాను పేరు సంపాదించారు. జగన్ ,షర్మిల పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. వాళ్లకు అధికారం కావాలి, డబ్బు కావాలి, పవర్ తో పాటు వ్యాపారాలు చేసుకోవాలి. అందుకోసం ఏదైనా చేస్తారు. ఎలాగైనా జనాన్ని నమ్మిస్తారు. మొండిగా ముందుకు వెళ్తారు. జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యం గాని ,అజెండా గాని ఏమీ లేవు. ముఖ్యమంత్రి కావడమే జగన్ లక్ష్యం. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, భార్య భారతి లక్ష్యం కూడా తమ కుటుంబానికి రాజకీయ అధికారం , జగన్ సీఎం కావడమే. అది నెరవేరింది. జగన్ ముఖ్యమంత్రి కావడంలో షర్మిల కృషి ఎంతో కొంత ఉంది. జగన్ కు అధికారం పై ఎలా ఆశ ఉంటుందో షర్మిల కు అలాగే ఉంటుంది.

జగన్ కు డబ్బు పిచ్చి ఎంత ఉంటుందో షర్మిల కు అంతే డబ్బు పిచ్చి ఉంటుంది. జగన్ ఆస్తులు ఎలా పెంచుకోవాలనుకుంటాడో షర్మిల తన ఆస్తులు పెంచుకోవాలని కూడా అనుకుంటుంది. వాళ్ళిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినవాళ్లు. ఒకే తండ్రి వారసత్వాన్ని పంచుకున్న వాళ్ళు. కానీ ఆ విషయాన్ని విస్మరించాడు జగన్. అధికారం వచ్చాక షర్మిలను జాగ్రత్తగా పక్కన పెట్టాడు. ఆమెకు పార్టీ పదవి ఇవ్వలేదు… రాజ్యసభ కట్ట పెట్టలేదు. రాజ్యం వీరభోజ్యం అనుకునే రకం షర్మిల. తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి పదవి తన హక్కు అని జగన్ అనుకున్నప్పుడు… షర్మిల కూడా తనకు హక్కులున్నాయని అనుకుంటుంది కదా. అప్పటికి షర్మిల బినామీ పేర్లతో మైన్స్ బిజినెస్ చేస్తూనే ఉంది. ఆమె భర్త బ్రదర్ అనిల్ మరికొందరితో కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు. కానీ అవి సరిపోవు కదా. వ్యాపారంలోనూ, రాజకీయంలోనూ మనం శత్రువులను పెంచుకోకూడదు.

సొంత ఇంటి శత్రువులను అసలు పెంచుకోకూడదు. జగన్ అక్కడే పెద్ద పొరపాటు చేశారు. ఆస్తిలో షర్మిల కు పూర్తి వాటా ఇవ్వడానికి నిరాకరించారు. రాజ్యసభ సీటు, పార్టీ పదవి ఇవ్వడానికి కూడా ససేమిరా అన్నారు. జగన్ కి ఇద్దరు ఆడపిల్లలే. వాళ్లు రాజకీయాల్లోకి వస్తారో రారో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. షర్మిలకు ఒక కొడుకు. పైగా రాజారెడ్డి అని పేరు పెట్టుకుంది. రేపు మేనల్లుడు రాజకీయ అధికారం కోసం పోటీపడితే ఏంటి పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి ముందే ఆలోచించి ఉండవచ్చు. కనీసం ఆస్తి ,డబ్బు విషయంలోనైనా సరే షర్మిలకు ఎంతో కొంత సెటిల్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. షర్మిల కు ఒక రాజకీయ పార్టీ పెట్టి, దాన్ని నడిపే అంత శక్తి లేదు. రాజకీయాల్లో ప్రస్తుతానికి ఆమె కామెడీ క్యారెక్టర్ లాంటిది. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయిన తర్వాత షర్మిల కి ఇప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది.

అది కూడా తెలంగాణలో పార్టీ (YSSTP) పెట్టి దాన్ని తిరిగి చుట్టేసి కాంగ్రెస్లో విలీనం చేశాక ఆమెకు ఏపీ ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. దీన్నిబట్టి షర్మిల ఎంత నికార్సు అయినా నాయకురాలు అర్థం చేసుకోవచ్చు. మనం ఎలాంటి విషయాన్నైనా ఒకటికి పది సార్లు జనానికి చెప్పి వాళ్లని నమ్మించగలుగుతాం అని బలంగా నమ్ముతారు రాజకీయ నాయకులు. కూడా అదే ఫార్ములా ఫాలో అవుతుంది.2029 ఎన్నికల్లో షర్మిల గరిష్టంగా చేయగలిగేది జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే. ప్రతిరోజు జగన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ… బట్టలిప్పే కార్యక్రమం చేపడుతుంది షర్మిల. జగన్ క్యారెక్టర్ డామేజ్ చేయడమే ప్రస్తుత ఎన్నికల్లో షర్మిల లక్ష్యం. అది విజయవంతంగా పూర్తి చేయగలుగుతుంది. షర్మిల జగన్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేస్తే… జగన్ పై వచ్చే వ్యతిరేకత చంద్రబాబుకే అడ్వాంటేజ్ అవుతుంది. దీనికి తోడు కమ్మ మీడియా వెంటనే షర్మిలను అక్కున చేర్చుకుంది. జగన్ కు వ్యతిరేకంగా షర్మిల వాయిస్ ను ప్రపంచమంతా వినిపించడం మొదలుపెట్టింది.

ఎవరి అవకాశం వాళ్ళది. బహుశా ఇదంతా జగన్ ముందుగా అంచనా వేసి ఉండకపోయుండొచ్చు. లేదా మొండిగా తనను ఎవరూ ఏమీ చేయలేరని భావించి ఉండవచ్చు. బిజెపితో అంతర్గత ఒప్పందం చేసుకున్న జగన్ షర్మిల తో మాత్రం ఎందుకు రాజీ పడలేకపోయారో అర్థం కాదు. మొదట్లోనే షర్మిల తో రాజీ పడి ఆమెకు ఆస్తిలో వాటా, ఒక పదవి, పార్టీలో మరో పదవి షర్మిల భర్త అనిల్ కు కాంట్రాక్టులు, మైన్స్ ఇచ్చి ఉంటే అసలు ఇంత గొడవ వచ్చి ఉండేదే కాదు. కానీ ఇన్ని చేసి తన ఇంట్లోనే ఒక రాజకీయ ప్రత్యర్థిని తయారు చేసుకోవడం అవసరమా అని జగన్ భావించి ఉండవచ్చు. అందుకే షర్మిలను, తల్లి విజయమ్మను నిర్బంధంగా పక్కకు తప్పించారు జగన్. నిజమే రాజకీయాల్లో శత్రువులు ఎదురుగా ఉండరు, పక్కనే ఉంటారు. ముందస్తు ప్రమాదాన్ని జగన్ ఇప్పుడే ఊహించి ఉండొచ్చు. కానీ షర్మిల బయటకి వెళ్తే ఎంత కంపు అవుతుందో మాత్రం ఆయన అంచనా వేయలేదు.

అక్కడే జగన్ దెబ్బ తిన్నారు. జగన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ (Chandrababu – Pawan Kalyan) తిట్టడం వేరు షర్మిల తిట్టడం వేరు. షర్మిల తిడితే జనం నమ్ముతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. షర్మిల తో జగన్ సెటిల్ చేసుకొని ఉంటే ఇప్పుడు ఇంత సమస్య వచ్చింది కాదు. అహంకారం, మొండితనం ఒక్కోసారి ఒక్కోసారి పతనానికి ఎలా దారితీస్తుందో కొద్దిరోజుల క్రితం కేసీఆర్ విషయంలో చూశాం. ఇప్పుడు జగన్ విషయంలో చూడబోతున్నాం. కానీ సమయం లేదు మిత్రమా ఆలస్యం అయిపోయింది.