అసలు వీఆర్ అంటే…? వీఆర్ లో ఉన్న పోలీసులకు జీతం ఇస్తారా…?

2019 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఒక పదం మనకు పదే పదే వినపడుతోంది. అదే వీఆర్. వేకేన్సి రిజర్వ్... పోలీసుల విషయంలో ఏదైనా చర్య తీసుకోవాలంటే ముందుగా ఈ నిర్ణయం తీసుకుంటారు పోలీసు ఉన్నతాధికారులు.

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 01:08 PM IST

2019 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఒక పదం మనకు పదే పదే వినపడుతోంది. అదే వీఆర్. వేకేన్సి రిజర్వ్… పోలీసుల విషయంలో ఏదైనా చర్య తీసుకోవాలంటే ముందుగా ఈ నిర్ణయం తీసుకుంటారు పోలీసు ఉన్నతాధికారులు. అప్పట్లో వైఎస్ జగన్ ను విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులను వీఆర్ కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత చాలా మంది పోలీసులను వీఆర్ కు పంపారు. ఇప్పుడు వైసీపీకి సహకరించి, తమను ఇబ్బంది పెట్టారని భావిస్తున్న పోలీసులను వీఆర్ కు పంపుతూ సర్కార్ ఆదేశాలు ఇస్తోంది.

చట్టాన్ని అతిక్రమించిన పోలీసులను వీఆర్ కు పంపి పోస్టింగ్ ఇవ్వకుండా అలా ఉంచుతారు. వాళ్ళ అద్రుష్టం బాగుంటే పోస్టింగ్ వస్తుంది. కాని జీతానికి పోస్టింగ్ కి సంబంధం ఉండదు. జీతం పడుతుంది… వాళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు జరిగితే మాత్రమే జీతం ఆగుతుంది గాని… రూల్స్ ప్రకారం జీతం ఇవ్వాల్సిందే. వీఆర్ లో ఏపీలో చాలా మంది పోలీసులే ఉన్నారు.

ఆ లెక్కలు బయటకు రావడం లేదు గాని… వారిలో కొందరికి కూటమి అధికారంలోకి వచ్చాక పోస్టింగ్ వచ్చింది. గతంలో వీఆర్ లో ఉన్న పోలీసులకు జీతాలు ఇవ్వడం లేదనే విమర్శలు వచ్చాయి. కొందరికి సగం జీతాలే ఇచ్చారనే ఆరోపణ కూడా వచ్చింది. దీనిపై అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ ఆర్ధిక శాఖకు లేఖ రాసి… జీతాలు వేయాలని కోరారు. తాజాగా కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగులను కొట్టిన ఒక ఎస్సై గారిని వీఆర్ కు పంపుతూ చర్యలు తీసుకున్నారు.