Chandrababu Sarkar : చంద్రబాబు సర్కార్ లో పవన్ పొజిషన్ ఏంటి?

ఏపీలో త్వరలో టిడిపి, జనసేన ,బిజెపి లతో కూడిన ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడడం దాదాపు ఖాయమనిపిస్తోంది. పార్టీలు ఎవరి సర్వేలు వాళ్ళు చూసుకొని తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న... ఎక్కువమంది ప్రజల అభిప్రాయం మాత్రం ఎన్డీఏ సర్కార్ వైపే ఉంది.

 

 

 

ఏపీలో త్వరలో టిడిపి, జనసేన ,బిజెపి లతో కూడిన ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడడం దాదాపు ఖాయమనిపిస్తోంది. పార్టీలు ఎవరి సర్వేలు వాళ్ళు చూసుకొని తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న… ఎక్కువమంది ప్రజల అభిప్రాయం మాత్రం ఎన్డీఏ సర్కార్ వైపే ఉంది. ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా టిడిపి ,జనసేన. బిజెపి మంత్రులతో క్యాబినెట్ రూపకల్పన జరగనుంది. గెలిస్తే ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోయే వ్యవహారం. కానీ ఇదంతా జరగడానికి మూలకారకుడైన పవన్ కళ్యాణ్ రేపు చంద్రబాబు గవర్నమెంట్ లో ఏ పొజిషన్లో ఉంటారు,? ఏ పాత్ర పోషించబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. జనసేన, కాపు సామాజిక వర్గంలో చాలామంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తీసుకోవాలని, దాంతో పాటు హోం మంత్రిత్వ శాఖ కూడా నిర్వహించాలని అభిప్రాయపడుతున్నారు. మంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యత తీసుకుంటేనే పవన్ కళ్యాణ్ కు అనుభవం కూడా వస్తుందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఏపీలో టిడిపికి మళ్లీ ప్రాణం పోసింది పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి కట్టడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్.

కాపు సామాజిక వర్గం టిడిపికి, బిజెపికి ఓట్లు వేయడానికి కారణం పవన్ కళ్యాణ్. దాదాపు నూట పాతిక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించాడు. ఈ నియోజకవర్గాలన్నిటిలోనూ .. ప్రతిచోట.. గెలుపు కావాల్సిన ఐదు నుంచి పదివేల ఓట్లు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చాయి. ఇది
అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో ఒక సముచిత స్థానం దక్కాల్సిందేనని ఆయన ఫ్యాన్స్ గాని, కాపు సామాజిక వర్గం గానీ, జనసైనికులు గాని కోరుకోవడం ధర్మం. అందువల్లే రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి దక్కాలని కోరుతున్నారు. ఇంకొందరు డిప్యూటీ సీఎం తో పాటు హోమ్ మినిస్టర్ గాని, ఇరిగేషన్ శాఖ ఆయనకి ఇస్తే మేలు జరుగుతుందని చెప్తున్నారు. రెండు మూడు మినిస్ట్రీలైన పవన్ కళ్యాణ్ దగ్గర ఉండాలని సూచిస్తున్నారు. ఇంత కష్టపడి టిడిపిని ,జనసేన ని ,బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చి ఏ పదవి తీసుకోకుండా ఉంటే క్యాడర్లో నిరాశ వస్తుందని, అంతేకాదు పార్టీని పటిష్టం చేయాలంటే, మేడర్ లో కాన్ఫిడెన్స్ పెంచాలంటే నేతలు కచ్చితంగా పదవుల్లో ఉండాలని జనసేనలో కొందరు కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ పదవి తీసుకోకపోతే అసలు ఎందుకు ఈ శ్రమ అంతా పడటం అది కూడా ఓపెన్ గాని కామెంట్ చేస్తున్నారు. 2014 లో కూడా పవన్ కళ్యాణ్ ఒక్క పదవి కూడా తీసుకోకుండానే ఐదేళ్లు గడిపారు. దీనివల్ల క్యాడర్ బాగా నిరుస్తా పడ్డారు.2014లో ఎమ్మెల్యే సీట్లు తీసుకుని పోటీ చేయకపోవడం ఒక తప్పైతే, గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక్క పదవి తీసుకోకుండా ఐదేళ్లు ఉండటం వల్ల, నేతల్లో క్యాడర్లో నిరాశ వచ్చి పార్టీ బలహీన పడిందని చాలామంది అభిప్రాయం. అందువలన ఇప్పుడు రాజకీయంగా బలపడాలంటే పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన నేతలకు మంత్రి పదవులు దక్కాలని భావిస్తున్నారు పార్టీ కార్యకర్తలు .అయితే వీటన్నిటికీ భిన్నంగా జరగబోతోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ తాను ఎటువంటి పదవి స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారట. అయితే ముఖ్యమంత్రి అవ్వాలి ,లేదా ఏ పదవి లేకుండా నా పని నేను చేసుకోవాలి అనే అభిప్రాయంలో ఉన్నారట పవన్ కళ్యాణ్. దీనికి కారణాలపై రకరకాలుగా విశ్లేషణ జరుగుతున్నాయి. ఎవరి విశ్లేషణ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తన అభిమానులు, జనసైనికులు తనని ముఖ్యమంత్రిగా మాత్రమే చూడాలనుకున్నారు. చిన్న మంత్రి పదవి కోసం ఇదంతా చేశాను అంటే విలువ ఉండదు. అందువల్ల అయితే ముఖ్యమంత్రి కావాలి లేదా సాధారణ ఎమ్మెల్యేగా ఉండి పోవాలి అని పవన్ నిర్ణయించుకున్నారట. రెండుసార్లు కొందరు సీనియర్ నాయకులు ఇదే విషయంపై చర్చ పెట్టినప్పటికీ ప్రస్తుతానికి అలాంటివి ఏమీ వద్దు అని కాస్త సీరియస్ గానే చెప్పారట. డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడం కన్నా ఆ పదవి తీసుకోకుండా ఉంటే చాలా గౌరవం ఉంటుందని జనసేనాని భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి అవ్వాలి లేదా గౌరవంగా ఏ పదవి లేకుండా ఉండాలి. మంత్రి పదవి కంటే అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ భావిస్తున్నారంట.

అయితే దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. క్యాబినెట్లో మంత్రిగా కూర్చుంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను కూడా బాధ్యత వహించాలి. అది ఎలా చూసినా తలనొప్పి. అంతేకాదు ఎవరు ఎన్ని ఎలా అనుకున్నా… లోకేష్ తో కచ్చితంగా భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.

2014 ..19 మధ్య లోకేష్, ఆయన మిత్రుడు కిలారు రాజేష్ వ్యవహార శైలితో ప్రభుత్వంలో చాలా సమస్యలు వచ్చాయి. ఈసారి కూడా లోకేష్ ,రాజేష్ తెరవెనక వ్యవహారాలన్నీ నడిపిస్తారు. వాటి పైన ఎలాగూ ఆరోపణలు వస్తాయి. క్యాబినెట్ లో ఉంటే లోకేష్ చేసే వ్యవహారాలన్నిటికీ తాను కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల ఇలాంటి తలనొప్పులు ఏమీ లేకుండా మిగిలిన జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించి తాను మాత్రం ఎమ్మెల్యేగా, ఒక సలహాదారు పాత్రలో మాత్రమే ఉండడం మేలు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఎమ్మెల్యేలుగా గెలిస్తే నాదెండ్ల మనోహర్ తో పాటు కనీసం నలుగురు జనసేన నేతలు మంత్రి మంత్రులు అయ్యే అవకాశం ఉంది. అలాగే మిగిలిన వారికి కూడా పదవులు దక్కుతాయి. తాను ఎటువంటి పదవులు ఆశించకుండా, ప్రభుత్వ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సలహాలిస్తుండాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. పార్టీలోనూ, ఫాన్స్ లోనూ చాలామందికి ఇది ఇష్టం లేకపోయినా తాను మాత్రం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్థిరంగా ఉన్నారట కళ్యాణ్.