AP Politics, Tammineni’s : అనర్హతపై ఇప్పుడు గొడవేంటి..? తమ్మినేని చేతిలో బ్రహ్మాస్త్రం

ఏపీ అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో పార్టీల మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న వివాదం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ దగ్గరకు వస్తున్న ఈ టైమ్ లో జంపింగ్ జపాంగ్స్ ని అనర్హులుగా ప్రకటిస్తే.. ఎవరికి ఏం లాభం అన్న చర్చ నడుస్తోంది. కానీ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో లబ్ది పొందడానికి వైసీపీ, టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో పార్టీల మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న వివాదం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ దగ్గరకు వస్తున్న ఈ టైమ్ లో జంపింగ్ జపాంగ్స్ ని అనర్హులుగా ప్రకటిస్తే.. ఎవరికి ఏం లాభం అన్న చర్చ నడుస్తోంది. కానీ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో లబ్ది పొందడానికి వైసీపీ, టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. పార్టీల పంతంతో.. అటు నలుగురు, ఇటు నలుగురు.. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. దాంతో ఎవరిపై వేటు వేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్.

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిని దక్కించుకోడానికి తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై ఒత్తిడి తెస్తోంది వైసీపీ. అలాగైతే.. వైసీపీలోకి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు గోడలు దూకి చాలా నెలలు అయ్యాయి. రెండు పార్టీల నుంచి వచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ ఎప్పుడో పక్కబెట్టారు. కానీ వైసీపీ మాత్రం.. తమ పిటిషన్ ఆమోదించి. టీడీపీలోకి వెళ్ళిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. టీడీపీ నుంచి కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. వాళ్ళపైనా చర్యలకు చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపికి 151 సీట్లు ఉంటే, టీడీపీకి 23, జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకోవాలంటే… ముందుగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలి. వాళ్ళ నుంచి సమాధానాలు తీసుకోవాలి. ఒకవేళ కొందరు టైమ్ అడిగితే ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. ఈలోగా ఏపీకి అసెంబ్లీ ఎన్నికల వస్తాయి. ఇంత తక్కువ టైమ్ లో వీళ్ళ అనర్హత పిటిషన్లు పరిష్కరించడం స్పీకర్ కు అసాధ్యం. కానీ వైసీపీ ఒత్తిడి చేస్తుండటంతో తమ్మినేని సీతారాంకు ఏం చేయాలో తెలియడం లేదు.

అయితే వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు కూడా వైసీపీ టిక్కెట్ ఇవ్వట్లేదు. తన కొడుకు కోసం ట్రై చేసినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఆయన ఆముదాల వలస నుంచి సిట్టింగ్ ఎమ్మల్యేగా ఉన్నారు. అక్కడ ఓ మహిళా అభ్యర్థిని దించాలని జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టైమ్ లోనే అనర్హత పిటిషన్లు సీతారాం దృష్టికి వచ్చాయి. మరి వైసీపీ చెప్పినట్టు వెంటనే అనర్హత వేటు వేస్తారా. ఈ అవకాశాన్ని వాడుకొని తన టిక్కెట్ తెచ్చుకుంటారా అన్నది చూడాలి. ఏదేమైనా తమ్మినేని చేతిలో వైసీపీ మీద వదలడానికి ఓ బ్రాహ్మాస్త్రం మాత్రం రెడీగా ఉంది. దాన్ని వాడుకుంటారా.. లేకపోతే ఏం మాట్లాడకుండా ఉండిపోతారా అన్నది చూడాలి.