NANDAMURI FAMILY : నందమూరి ఫ్యామిలీలో గొడవేంటి ? తారక్ ని పక్కన పెడుతోంది అందుకేనా ?

నందమూరి కుటుంబంలో (Nandamuri Family) మళ్లీ లొల్లి షురూ అయిందా ? ఎన్టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat) సాక్షిగా విభేదాలు బయటపడ్డాయా ? ఇన్నాళ్లు కోల్డ్‌వార్‌ (Coldwar) జరిగితే.. ఇప్పుడే బహిర్గతమైందా ? బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నారా ? కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకవైపు.. మిగిలిన కుటుంబం అంతా మరో వైపు ఉందా ?

నందమూరి కుటుంబంలో (Nandamuri Family) మళ్లీ లొల్లి షురూ అయిందా ? ఎన్టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat) సాక్షిగా విభేదాలు బయటపడ్డాయా ? ఇన్నాళ్లు కోల్డ్‌వార్‌ (Coldwar) జరిగితే.. ఇప్పుడే బహిర్గతమైందా ? బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నారా ? కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకవైపు.. మిగిలిన కుటుంబం అంతా మరో వైపు ఉందా ? చంద్రబాబును అరెస్టు చేసినా.. భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడినా జూనియర్ ఎన్టీఆర్‌ ఎందుకు స్పందించలేదు ?

బాల కృష్ణ వర్గం, జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చాలా కాలంగా విభేదాలున్నాయి. వీళ్ళిద్దరి మధ్య అనడం కంటే టీడీపీతో (TDP) ఎన్టీఆర్‌కు అంటే బెటర్. ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. ఒకరి గురించి ఒకరు ప్రస్తావించకుండా ప్రసంగాలు, కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా కనిపించిన సీన్‌.. వారి మధ్య ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో.. తెలుగు ప్రజలు, అభిమానులకు తెలిసేలా చేసింది. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్‌ వర్గానికి టీడీపీ శ్రేణులకు అసలు పడటం లేదు. కొన్ని సందర్భాల్లో జూనియర్ ప్రస్తావన వచ్చినా.. టీడీపీ నేతలు స్పందించడ లేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత.. ఈ గ్యాప్ మరింత పెరిగింది.

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టయినప్పుడు నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదంటూ టీడీపీ అభిమానులు.. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తారక్ మాత్రం.. అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని విషయాలపై స్పందించే జూనియర్ ఎన్టీఆర్‌.. మామయ్య చంద్రబాబు అరెస్టుపై ఎందుకు స్పందించలేదని టీడీపీ కార్యకర్తలు అప్పట్లో ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. జూనియర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ (I don’t care) అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ మరోసారి రచ్చ రాజేశాయి. బాలయ్య కామెంట్స్ పై జూనియర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అదే స్థాయిలో బాలయ్య అభిమానులు కౌంటర్లు ఇచ్చారు.

నందమూరి కుటుంబం పెద్దది కావడంతో.. చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు కామన్. ఇలా ఏ కుటుంబలో అయినా జరిగేవే. ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandheswari), చంద్రబాబు ఫ్యామిలీతో కూడా అసలు పడేది కాదు. ఇప్పుడు హరికృష్ణ ఫ్యామిలీతో (Harikrishna Family) మిగిలిన కుటుంబసభ్యులు దూరంగా ఉంటున్నారు. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (Kalyan Ram) కలిసిపోయారు. మిగిలిన నందమూరి ఫ్యామిలీకి వీళ్ళు దూరంగా ఉంటున్నారు. చుట్టపు చూపుగా మాత్రమే కనిపిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుపై బీజేపీ అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి ఖండించారు. మిగిలిన కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మాణిని ఓదార్చారు. కొందరు రాజమండ్రి వెళ్లి భువనేశ్వరికి సంఘీభావం ప్రకటించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి వాటికి కల్యాణ్ రామ్ మామూలుగానే దూరంగా ఉంటారు. జూనియర్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తారు. అయినా రియాక్ట్ కాకపోవడంతో టీడీపీ శ్రేణులతో పాటు బాలకృష్ణ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో భువనేశ్వరిని కించపరుస్తూ కామెంట్స్ చేసినప్పుడు, చంద్రబాబు కన్నీళ్ళు పెట్టినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్‌ తనకేమీ తెలియనట్లుగా ఉన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రం కావడంతో.. చంద్రబాబు, భువనేశ్వరి పేర్లు లేకుండా జనరల్ గా ట్వీట్ చేసి సైలెంట్‌ అయ్యారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రొద్భలంతోనే కొడాలి నాని.. చంద్రబాబును తిడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

జూనియర్, కల్యాణ్‌ రామ్ ఓ వైపు.. మిగతా ఫ్యామిలీ అంతా మరోవైపు ఉంది. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీ పెళ్లికి కూడా జూనియర్ కి ఆహ్వానం లేదు. దాంతో ఆయన తండ్రి హరికృష్ణ కూడా పెళ్లికి వెళ్లలేదు. తారక రత్న పెద్ద కర్మకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ను చూసి కూడా.. చూడనట్టుగా బాలకృష్ణ వ్యవహరించడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయింది. అందుకే డెవిల్ మూవీ రిలీజ్ సందర్భంగా రాజకీయాలపై కల్యాణ్‌ రామ్ కామెంట్స్ వైరల్‌ అయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి సపోర్ట్ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. తారక్, కళ్యాణ్ రామ్.. మామ చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు అప్పట్లోనే బయటపడింది.
నార్నే శ్రీనివాసరావు కుమార్తె ప్రణతిని జూనియర్‌ కు ఇచ్చి పెళ్లి చేయడం వెనుక చంద్రబాబు కుటుంబమే ముందుంది. శ్రీనివాసరావు చంద్రబాబుకు బంధువు. అందుకే ఆ సంబంధం సెట్ అయింది. ఆ తర్వాత వాళ్ల మధ్య గ్యాప్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. హరికృష్ణ ఉన్నప్పటి నుంచే విభేదాలు వచ్చాయి. ఆయన మరణించాక ఆ గ్యాప్ కొనసాగుతోంది. తండ్రి హరికృష్ణ ఉన్నంతకాలం జూనియర్ ఎన్టీఆర్‌కు కుటుంబంలో ప్రత్యేక ప్రయారిటీ ఉండేది. ఆయన మరణం తర్వాత ఎన్టీఆర్.. నందమూరి కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. అదే సమయంలో కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సంబంధాలు బలపడ్డాయి. ఐ డోన్ట్ కేర్ అని బాలయ్య అనడం వెనుక రీజన్ కూడా ఇదే. కుటుంబం అన్నాక బోలెడు విభేదాలుంటాయని.. అలా అని వదులుకుంటామా అని బాలకృష్ణ తర్వాత కవర్ చేశారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరింత ఆజ్యం పోస్తున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి (NTR centenary) సందర్భంగా రిలీజ్ చేసిన ప్రత్యేక 100 రూపాయల నాణెం ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. తాత ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే జూనియర్.. ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమానికి డుమ్మా కొట్టడంపై విమర్శలు వచ్చాయి. అక్క సుహాసిని కొడుకు పెళ్లికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమవుతూనే ఉన్నారని తెలుస్తోంది. గతంలో నిమ్మకూరులో జరిగిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించలేదని ఆయన ఫ్యాన్స్‌.. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. అయినా ఆ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళ లేదు.

కొంత కాలంగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్‌, బాలకృష్ణ అభిమానులకి మాటల యుద్ధం జరుగుతోంది. తారక్‌ రాజకీయంగా ఎదిగితే, నారా లోకేష్‌కు ప్రాధాన్యత లేకుండా పోతుందున్న భయం టీడీపీని వెంటాడుతోందని అంటున్నారు. బాలయ్య, చంద్రబాబు కలిసి కుట్ర చేస్తూ.. ఎన్టీఆర్‌ను కావాలనే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తారక్ ఫ్యాన్స్ ఆరోపణ. అదే సమయంలో హీరోగా ఎదిగే వరకు బాలయ్య పేరు చెప్పుకున్న జూనియర్ ఎన్టీఆర్‌.. ఒక స్థాయికి చేరాక ఆయన్ని లెక్క చేయట్లేదని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ఇటీవల టీడీపీ కార్యక్రమంలో జూనియర్‌ అభిమానులు, టీడీపీ శ్రేణులు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. జై ఎన్టీఆర్‌.. సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎన్టీఆర్ పేరును వాడటం, పార్టీ ఫ్లాగ్స్ కాకుండా.. ఎన్టీఆర్‌ జెండాలు ప్రదర్శించడమేంటి.. పార్టీ కార్యక్రమాలకీ ఎన్టీఆర్‌కీ సంబంధమేంటని నిలదీస్తున్నారు.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ మాటలు.. అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈవెంట్ మధ్యలో యాంకర్ ఓ అభిమానికి మైక్ ఇచ్చి.. తారక్ గురించి మాట్లాడమంటే.. జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. బాలయ్య అభిమానులపై తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోనే ఎన్టీఆర్ పేరు చెప్పి.. సీఎం సీఎం అని నినాదాలు చేయడంతో అవతలి వర్గం మండిపడింది. తారక్ తన ప్రసంగంలో తాత, తండ్రి పేర్లు ప్రస్తావించి.. బాలకృష్ణ పేరు ఎత్తలేదు. దీన్ని బాలయ్య అభిమానులు తప్పుబట్టారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ బాలకృష్ణ.. తారక్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. ఆయన పేరు ఎందుకు ఎత్తాలని అభిమానులు అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ కి మాత్రం ఆత్మాభిమానం ఉండదా.. ప్రతిసారీ బాలయ్య గురించి ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నిస్తున్నారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. విరామం లేకుండా ప్రచారం చేసినా…ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్టీఆర్ ప్రమాదంలో గాయపడ్డాడు కూడా. పార్టీ కోసం పని చేసిన వ్యక్తిని తొక్కేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తారక్ ఫ్యాన్స్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించడంతో వివాదం పీక్స్‌కు చేరింది. ప్రధాన మీడియాలో కంటే సోషల్ మీడియాలోనే ఈ అంశంపై చర్చ నడుస్తోంది. టీడీపీ వర్గీయులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పాత విషయాలను తవ్వి తీసి రచ్చ చేసుకుంటున్నారు.

బాలకృష్ణ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌…అంతటి జనాదరణ, అభిమానం సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే నంబర్ వన్ స్టార్ గా నిలిచారు. ఇపుడు టాలీవుడ్లో టాప్ హీరో. అలాంటి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య మంచి రిలేషన్స్ లేకపోవడం రెండు వర్గాల్లోనూ కలవరపాటుకు గురిచేస్తోంది. జూనియర్ కీ చంద్రబాబుతోనే విభేదాలు ఉన్నాయంటారు. అదే సమయంలో ఆయన నందమూరి కుటుంబంతో బాగానే ఉంటారు. జూనియర్ నటించిన అరవింద సమేత ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా బాలకృష్ణ వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. కానీ బాబాయ్.. అబ్బాయ్ మధ్య గొడవలు వచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీని నడిపించే భావి లీడర్‌గా ఆయన అభిమానులు ఊహించుకుంటున్నారు. చంద్రబాబు కొడుకు లోకేశ్ కి గానీ, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు గానీ పార్టీ నడిపించేంత నాయకత్వ లక్షణాలు లేవంటున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ… తారక్‌తో సఖ్యతగా ఉండకపోతే వాళ్ళకే నష్టమని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని, రెండు కుటుంబాలు కలిసిపోతేనే బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు.