TTD RACE : టీటీడీ ఛైర్మన్ ఎవరికి ? రేసులో నాగబాబు, అశ్వనీదత్

వైసీపీ (YCP) ఓడిపోయి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా అధికారం చేపట్టబోతున్నారు. దాంతో టీటీడీ ఛైర్మన్ పోస్టుకు కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వైసీపీ (YCP) ఓడిపోయి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా అధికారం చేపట్టబోతున్నారు. దాంతో టీటీడీ ఛైర్మన్ పోస్టుకు కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టీటీడీ ఛైర్మన్ పదవి (TTD Chairman post) రేసులో నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన (Janasena) నేత నాగబాబు, నిర్మాత అశ్వినీ దత్ (Ashwini Dutt), ఓ ఛానెల్ యజమాని, మరో బీజేపీ ఎంపీ… వీళ్ళల్లో ఎవరికో ఒకరికి దక్కతుందని అంటున్నారు. అశ్వినీదత్ తో చంద్రబాబుకి ఉన్న సాన్నిహత్యంతో ఆయనకే ఫస్ట్ ఛాన్స్ ఉండొచ్చని తెలుస్తోంది. బాబు అరెస్ట్ అయినప్పుడు జైలుకెళ్ళి కలిశారు అశ్వనీదత్. బాబుకి కష్టకాలంలో ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ఈసారి టీడీపీ 160 సీట్లు గెలుస్తుందని కూడా ఈమధ్యే చెప్పారు. మొన్నటి ఎన్నికలకు ముందు బాబుకి మద్దతుగా ఓ వీడియో కూడా అశ్వినీ దత్ రిలీజ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ రేసులో నాగబాబు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు… సీట్ల సర్దుబాటు కారణంగా పోటీ చేయకుండా తప్పుకున్నారు. కూటమి విజయం కోసం పనిచేశారు. అందువల్ల నాగబాబు పేరును జనసేనాని పవన్ కల్యాణ్ సూచించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీళ్ళిద్దరు కాకుండా… ఓ టీవీ ఛానల్ యాజమాని పేరు కూడా టీటీడీ ఛైర్మన్ రేసులో ఉంది.

గత ఐదేళ్ళుగా టీడీపీకి మద్దతుగా నిలిచిన ఆ టీవీ ఛానెల్ ఓనర్ కు ఫస్ట్ టైమ్ రెండేళ్ళ పాటు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అలాగే ఈ పదవికి బీజేపీ నుంచి గెలిచిన ఓ ఎంపీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురిలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది చూడాలి. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థను భ్రష్టుపట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల టీటీడీ పవిత్రత దెబ్బతినకుండా చూడాలని జనం కోరుతున్నారు. అందువల్ల చంద్రబాబు కూడా టీటీడీ ఛైర్మన్ పదవి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.