బందర్ వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashauri).. ఎవరు ఊహించని విధంగా వైసీపీకి రాజీనామా ( Resignation) చేసి జనసేనలోకి జంప్ అయ్యారు. అధికార పార్టీ ఎంపి ఏకంగా.. ఒక్క ఎమ్మెల్యే (MLA) సీటు కూడా లేని పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బాలశౌరి ఏ కాన్ఫిడెన్స్‌తో జనసేనలో చేరారు.. వైసీపీ పని అయిపోయిందని ఆయన ముందే గుర్తించారా.. అందుకే వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో (Janasena) చేరారా.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఇదే. జనసేన కంటే ఏ రకంగా చూసిన టీడీపీ వందరెట్లు బలమైన పార్టీ. నిర్మాణాత్మకమైన పార్టీ. ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే పార్టీ. అంత బలమైన పార్టీని వదులుకొని.. బలహీనమైన జనసేనలోకి అధికార పార్టీ ఎంపీ ఎందుకు వచ్చారు. చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. నిజానికి బాలశౌరి వైసీపీ నుంచి బయటికి రావాలని నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదు.
2009కి ముందే బాలసౌరికి ఢిల్లీలో పెద్ద లాబీయిస్టుగా పేరు ఉంది. ఢిల్లీ స్థాయిలో పెద్ద పెద్దవాళ్లతో సంబంధాలు, వ్యాపార పైరవీలు చేయడంలో బాలశౌరి దిట్ట. 2019లో ఆయన వైసీపీ ఎంపీ అయ్యాక.. చాలా తెలివిగా వ్యవహరించారు. అందరిలా తనను జగన్ పిలవట్లేదని, కలవట్లేదని.. బాలశౌరి బాధపడలేదు. అసలు జగన్ దృష్టిలో పడకుండా ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటూ, పైరవీలు చేసుకుంటూ తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ వచ్చారు. బాలశౌరి ఎన్నడు టీడీపీని కానీ.. జనసేన కానీ.. ఒక్క మాట విమర్శించలేదు. ఢిల్లీలో అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. బాలసౌరి వ్యవహారాలపై సీఎం జగన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది. బాలశౌరి మళ్లీ బందర్ నుంచి గెలవలేరని సర్వే రిపోర్ట్ జగన్ దగ్గర ఉంది. ఇది గుర్తించిన బాలశౌరి.. నాలుగు నెలల క్రితమే టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బహిష్కృత వైసీపీ ఎంపి రఘురామకృష్ణరాజు.. వీళ్ళందరి సహకారంతో ఢిల్లీలో మొదట చంద్రబాబును కలిశారు. ఆయన సలహా మేరకే తెలివిగా జనసేనలో చేరారు.
టీడీపీ (TDP) లో చేరినా.. బందరులో స్థానిక క్యాడర్, లీడర్లు సహకరించకపోవచ్చని.. దీంతో కొత్త సమస్యలు వస్తాయని.. ఎలాగూ కాపు సామాజికవర్గం సమీకరణాల్లో భాగంగా అక్కడ జనసేనకే సీట్ ఇస్తారు కాబట్టి.. టీడీపీలో చేరడం కంటే జనసేనలో చేరడం మంచిదని చంద్రబాబు సలహా ఇచ్చారట. రేపు భవిష్యత్తులో సమీకరణాలు మారితే.. టీడీపీలోకి వచ్చేయచ్చని హామీ కూడా ఇచ్చారట. ఆ సలహాతోనే బాలశౌరి ఇప్పుడు జనసేనలో చేరారు. ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకపోతే బాలసౌరి జనసేనలో చేరడమే ఆ పార్టీ క్యాడర్‌కు జీర్ణం కావడం లేదు. నిన్నటివరకు తిట్టిన పార్టీ నాయకుడిని.. ఇప్పుడు తమ నాయకుడిగా ఎలా స్వీకరించాలో అర్థం కాని అయోమయంలో ఉన్నారు బందర్ స్థానిక జనసేన నాయకులు.