Vijayamma : విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారంటే

ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) తల్లి విజయమ్మ (Vijayamma) అమెరికా (America) కు వెళ్లారు. ఆమె నార్మల్‌గా వెళ్లి ఉంటే ఓకే.. కానీ జగన్‌ మీద షర్మిల సునీత పోరాటం తారా స్థాయిలో కొనసాగుతున్న వేళ విజయమ్మ ఉన్నట్టుండి అమెరికాకు వెళ్లడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. షర్మిల తెలంగాణలో రాజకీయం చేసిన్ని రోజులు విజయమ్మకు ఎలాంటి సమస్యా లేదు.

ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) తల్లి విజయమ్మ (Vijayamma) అమెరికా (America) కు వెళ్లారు. ఆమె నార్మల్‌గా వెళ్లి ఉంటే ఓకే.. కానీ జగన్‌ మీద షర్మిల సునీత పోరాటం తారా స్థాయిలో కొనసాగుతున్న వేళ విజయమ్మ ఉన్నట్టుండి అమెరికాకు వెళ్లడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. షర్మిల తెలంగాణలో రాజకీయం చేసిన్ని రోజులు విజయమ్మకు ఎలాంటి సమస్యా లేదు. కానీ ఎప్పుడైతే షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ (AP Congress) అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుందో అప్పటి నుంచే చిక్కులు మొదలయ్యాయి. ఒకవైపు కొడుకు మరోవైపు కూతురు. ఎలూ తేల్చుకోలేని స్థితిలో విజయమ్మ ఉండిపోయింది. షర్మిల పోరాటం చంద్రబాబు మీదో పవన్‌ కళ్యాన్‌ మీదో ఐనా పరిస్థితి కాస్త బాగుండేది. కానీ షర్మిల మాత్రం నేరుగా జగన్‌నే టార్గెట్‌ చేస్తోంది. వివేకా హత్యను (Viveka’s murder) ఆయుధంగా చేసుకుని కడపలో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది.

ఇలాంటి టైంలో షర్మిలతో విజయమ్మ ఉంటే ఖచ్చితంగా తాను కూడా ఈ విషయాల మీద స్పందించాల్సి ఉంటుంది. లేదా తన స్టాండ్‌ ఏంటి తాను ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా ఉండబోతున్నారు అనే విషయం ఐనా క్లియర్‌గా చెప్పాలి. కానీ కొడుకు కూతురి మధ్య విజయమ్మ ఎటూ కాని సిచ్యువేషన్‌గా మారిపోయింది. దీంతో ఎన్నికలు పూర్తయ్యేదాకా తాను అమెరికా వెళ్లిపోవాలని విజయమ్మ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 27న జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆ తర్వాత షర్మిల బస్సుయాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురి కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఎదురుకావడంతో ఒత్తిడికి గురైన విజయమ్మ.. మధ్యే మార్గంగా అమెరికాకు వెళ్లినట్టు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కరవమంటే కప్పకు కోపం… విడమంటే పాముకు కోపం అన్న చందంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె వెంట విజయమ్మ నడిచారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం జగన్ అధికారంలో ఉండగా.. ఏపీ పీసీసీ (AP PCC) అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సోదరుడిపై ఆమె విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. తన ఇద్దరు బిడ్డలు.. ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరికి మద్దతిస్తే.. ఇంకొకరికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.