Congress Party : పార్టీ ఎందుకు పెట్టావ్ ? ఎందుకు మూసేశావ్? షర్మిల తింగరి రాజకీయం !

వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురెళ్లి పోరాడి... అక్రమ ఆస్తుల కేసులో జైలు కెళ్ళి.. దాదాపు 10యేళ్ళ పాటు రోడ్ల మీద తిరిగి.. రక రకాల వేషాలు వేసి, జనానికి ముద్దులు పెట్టి ఒళ్ళు నిమిరి, కులాన్ని ఉపయోగించి, తండ్రి బ్రాండ్ ఇమేజ్ ని వాడుకొని, ఆపై కోట్లు కుమ్మరించి, రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాడు. జగన్ కి అధికారం అంత ఈజీగా ఒడిలోకి వచ్చి వాలిపోలేదు. దాని వెనక పదేళ్లు కష్టం ఉంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఒక బలమైన నమ్మకం ఉంటుంది. రాజకీయాల్లో ఓర్పు, సహనంతో కొనసాగితే చాలు ఏదో ఒక రోజుకి అధికారం వచ్చి ఒళ్ళో పడుతుందని. రాజశేఖర్ రెడ్డి 30 ఏళ్లు రాజకీయాల్లో ఓర్పు, సహనంతోనే ఉన్నాడు. జగన్ కూడా 10యేళ్ళ పాటు పోరాడాల్సి వచ్చింది.

వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురెళ్లి పోరాడి… అక్రమ ఆస్తుల కేసులో జైలు కెళ్ళి.. దాదాపు 10యేళ్ళ పాటు రోడ్ల మీద తిరిగి.. రక రకాల వేషాలు వేసి, జనానికి ముద్దులు పెట్టి ఒళ్ళు నిమిరి, కులాన్ని ఉపయోగించి, తండ్రి బ్రాండ్ ఇమేజ్ ని వాడుకొని, ఆపై కోట్లు కుమ్మరించి, రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాడు. జగన్ కి అధికారం అంత ఈజీగా ఒడిలోకి వచ్చి వాలిపోలేదు. దాని వెనక పదేళ్లు కష్టం ఉంది.

తన ఫ్యామిలీ ఫండమెంటల్ ఫార్ములాని వదిలేసిన షర్మిల… రాజశేఖర్ రెడ్డి బొమ్మ మాత్రమే పెట్టుకుని తెలంగాణలో రాజకీయం చేయాలని వచ్చారు. షర్మిల అనే వ్యక్తి రియాలిటీకి ఎంత దూరంగా ఉంటారో జనానికి అర్థమైంది. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ లేదు. ఇక్కడ కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్నాయి. మరో కొత్త పార్టీ పెట్టడానికి ప్రత్యేక కారణం కూడా లేదు. జనం కొత్త పార్టీల కోసం ఎదురు చూడ్డం లేదు. మా అన్నతో నాకు గొడవైంది గనుక …నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలి.. మాకు పాలిటిక్స్ తప్ప వేరే పనిరాదు గనక ఎక్కడో చోట పాలిటిక్స్ చేసుకుని బతకాలి అన్న మొండితనంతో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ పార్టీకి ఒక అజెండా లేదు. ఒక లక్ష్యం లేదు.. లక్షణం లేదు.

షర్మిల కు మైనింగ్ వ్యాపారం ఉంది. ఆ వ్యాపారాన్ని ఆమె బినామీలు నడుపుతూ ఉంటారు. భర్త అనిల్ పర్యవేక్షిస్తూ ఉంటారు. వీళ్ళంతా కలిసి షర్మిలని ఊదర గొట్టారు. వీళ్ళకి తోడు ఒక మీడియా అధిపతి, మరికొందరు గ్రేడ్ టు జర్నలిస్టులు.. షర్మిల జట్టులో చేరారు. ఆమె దగ్గర అయిదారు కోట్ల రూపాయలు నాకేశారు. కాంగ్రెస్, బిజెపి రాష్ట్రంలో బలహీనంగా ఉన్నాయనీ.. ఇదే సమయంలో నువ్వు కేసీఆర్ టార్గెట్ గా రాజకీయం చేస్తే.. ప్రజల ఆదరిస్తారని బాగా ఎక్కించారు. దాంతో షర్మిల వెనక ముందు చూడకుండా తెలంగాణ బరిలో దూకేశారు.

అప్పటి దాకా ఆంధ్ర రాజకీయాల్లో… వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిలకు సడన్ గా తెలంగాణ ఎందుకు గుర్తుకొచ్చింది. తెలంగాణ బరిలోకి దిగితే తనను ఆదరిస్తారని తెలుసా ? వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతాయని అనుకుందా ?

భాష, భావోద్వేగాలే కీలకంగా నడిచే తెలంగాణలో… షర్మిల భాష గాని, ఆహార్యంగానీ… మాట్లాడే తీరు కానీ ఏ రకంగానూ జనానికి ఎక్కదు. నేను తెలంగాణ కోడల్ని అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని తిరిగినంత మాత్రాన జనం ఆమోదించరు. ఈ చిన్న విషయాన్ని షర్మిల గుర్తించలేదు. ఏ పార్టీలో సీట్లు దొరకనోళ్లు, ఫోర్త్ గ్రేడ్ కార్యకర్తలు… వంద మంది షర్మిల చుట్టూ చేరి… రోజూ చెక్కభజన మొదలుపెట్టారు. చివరకు షర్మిల పరిస్థితి గురిలేని బాణంలా తయారైంది. తెలంగాణలో ఆమె పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఆమెను చేర్చాలని కొందరు ప్రయత్నించారు. దాంతో రేవంత్ రెడ్డికి ఎర్త్ పెట్టొచ్చని ఆశపడ్డారు. రేవంత్… హైకమాండ్ దగ్గర స్పష్టంగా చెప్పేశారు. షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. రేవంత్ పాచిక పారింది. ఆయన్నే కాంగ్రెస్ హైకమాండ్ నమ్మింది. ఎన్నికలకు షర్మిలను దూరంగా పెట్టింది. ఆమెతోనే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన ఇప్పించింది. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక… ఇప్పుడు షర్మిల పార్టీని విలీనం చేసి… ఆమెను ఏపీ కాంగ్రెస్ లోకి దించుతోంది.

ఏపీలో 2% కూడా ఓటింగ్ లేని కాంగ్రెస్… జనం చీల్చి చెండాడిన కాంగ్రెస్ కి ఇప్పుడు షర్మిల సారధి అవుతోంది. ఓవరాల్ గా చూస్తే… జగన్ తో విభేదించి తన శక్తి సామర్ధ్యాలని చాలా అతిగా అంచనా వేసి… షర్మిల ఈ మొత్తం గేమ్ లో దెబ్బతింది. ఒక పొలిటికల్ జోకర్ గా, కమెడియన్ గా మిగిలిపోయింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. మహా అయితే ఒక ముగ్గురు, నలుగురు గ్రేడ్ టు జర్నలిస్టులకి ఉపయోగపడి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ తరపున షర్మిల చేసే ప్రయత్నం… ఓట్లు చీల్చి జగన్ కి మేలు చేస్తుంది. కనీసం 15, 20 యేళ్ళు… అక్కడ రాజకీయం చేయగలిగితే షర్మిల ఆశించిన ఫలితం దక్కవచ్చు. అప్పటి వరకు మాత్రం షర్మిల ఆంధ్రాలో కూడా పొలిటికల్ జోకరే అవుతారు.