మెగా ఫ్యామిలీలో లుకలుకలు నిజమేనని.. అల్లు అర్జున్ కామెంట్స్‌తో ప్రూవ్ అయింది. బన్నీకి, మెగా ఫ్యామిలీకి దూరం పెరిగింది అన్నది ఇకపై ప్రచారం కాదు.. నిజం అని తేలిపోయింది. దీంతో మెగా హీరోల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదంతా బన్నీ పుణ్యమే అంటూ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ నుంచి… అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం ఫ్యాన్స్ మానేశారు. ఆ తర్వాత ఓ ఈవెంట్‌లో అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటే.. తనకు ఆర్మీ ఉందని అభిమానులను మరింత కెలికాడు. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. ఏపీ ఎన్నికలు.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మరింత దూరం పెంచింది. ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన ఫ్రెండ్, వైసీపీ అభ్యర్తి శిల్పా రవికి మద్దతుగా బన్నీ నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని అభిమానులను కోరారు. ఈ ఘటనతో మెగా, పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది. సొంత మేనమామ పవన్ కళ్యాణ్ కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ దగ్గరకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా జనసేనాని బద్ద వ్యతిరేకి జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ ట్రోలింగ్ చేశారు. కట్ చేస్తే ఏపీ ఎన్నికల్లో జనసేన సూపర్ విక్టరీ కొట్టింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఫలితాల తర్వాత బన్నీ సైలెంట్ అయ్యారు. ఐతే అల్లు అర్జున్ మారిపోయారేమో అని అంతా అనుకున్నారు. ఐతే నచ్చిన వాళ్ల కోసం నచ్చిన పని చేయడంలో తప్పులేదు అంటూ.. ఓ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో బన్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌కు మరింత మండింది. బన్నీని మరింత టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కావాలనే బన్నీ కాంట్రవర్సీగా మాట్లాడారని.. ఇదే నీ పతనం అంటూ.. మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇంద్ర రీ రిలీజ్ రోజు అయితే.. మరింత రచ్చ చేశారు. ఇంద్రలో శివాజీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ పేరును థియేటర్‌లోని ప్రతి ఒక్కరు .. మేనల్లుడు, మేనల్లుడు అని అరిచిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. బన్నీ మీద ఫ్యాన్స్ ఆ లెవల్‌లో కోపంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో పుష్ప 2 రాబోతోంది. దీనిపై కూడా ఫ్యాన్స్ దెబ్బ భారీగానే పడే అవకాశం ఉంది. పుష్ప 1 పాన్ ఇండియా లెవల్‌లో హిట్ అయింది. పుష్ప 2 మీద భారీగా అంచనాలు పెరిగాయ్. అలాంటిది ఇప్పుడు మెగ్ ఫ్యాన్స్‌ను గోకి బన్నీ తప్పు చేసినట్లు కనిపిస్తున్నాడు. బాయ్‌కాట్ పుష్ప 2 అని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఓ ప్రచారం మొదలుపెట్టారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే.. బన్నీకి మరింత దెబ్బ పడడం ఖాయం. ఆగస్ట్‌లో రిలీజ్ కావాల్సిన పుష్ప.. మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్‌తో డిసెంబర్‌కు వాయిదా పడింది. అప్పటి వరకు మెగా ఫ్యాన్స్ కోపం తగ్గుతుంది.. సినిమా మీద ఏ ఎఫెక్ట్ ఉండదు అనుకున్నారు. బన్నీ మళ్లీ వివాదం రేపడంతో.. పుష్ప 2కు మెగా ఫ్యాన్స్ దెబ్బ పడడం ఖాయంగా కనిపిస్తోంది.