KOOTAMI MUSLIMS : ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారా ? బీజేపీ ప్రకటనతో టీడీపీకి షాక్

ఏపీలో కూటమిలోని టీడీపీ (TDP), జనసేనకు కొత్త చిక్కు వచ్చిపడింది. బీజేపీతో పొత్తుపెట్టుకొని NDA కూటమిగా ఏపీ (AP) లో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి.

 

 

 

ఏపీలో కూటమిలోని టీడీపీ (TDP), జనసేనకు కొత్త చిక్కు వచ్చిపడింది. బీజేపీతో పొత్తుపెట్టుకొని NDA కూటమిగా ఏపీ (AP) లో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. కానీ ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ లీడర్లు చేస్తున్న ప్రకటనలు మిగిలిన రెండు పార్టీలను ఇరకాటంలో పెడుతున్నాయి.

కాంగ్రెస్ కూటమిని (Congress Alliance) గెలిపిస్తే… మీ ఆస్తులను ముస్లింలకు దోచిపెడతారని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సభలో కామెంట్ చేశారు. ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ తొలగించి… వాటిని SC, ST, OBC లకు పంపిణీ చేస్తామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రెండు స్టేట్ మెంట్స్ పై ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి. ఏపీలో బీజేపీ (BJP) తో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనపైనా ఈ ప్రకటనలు ప్రభావం చూపించబోతున్నాయి.

ఏపీలో టీడీపీకి ముస్లింల ఓట్ బ్యాంక్ బాగానే ఉంది. అయితే బీజేపీ ప్రకటనతో ముస్లింల ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటిదేదో ముంచుకొస్తుందనీ… బీజేపీతో పొత్తు వద్దని టీడీపీ సీనియర్లు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ కేంద్రంలో బీజేపీ అండ లేకపోతే జగన్ ను ఢీకొనడం కష్టమని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నాయుడు. ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరక్కపోతే ఆ ఎఫెక్ట్ టీడీపీపై పడుతుందనీ… అందుకే కేంద్రం అండతో పోలింగ్ కి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చని అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రకటనలతో బాబు ఇరుకున పడ్డారు.

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తేస్తామన్న బీజేపీ నాయకుల ప్రకటనను వైసీపీ క్యాష్ చేసుకుంటోంది. చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. పొత్తులో భాగంగా ఏపీలో కూడా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ తీసేస్తారా… బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడతారా అని వైసీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. దాంతో టీడీపీకి ఏం చేయాలో తెలియని పరస్థితి ఏర్పడింది.