YCP Tickets : వైసీపీ సమన్వయకర్తలు ఉంటారా ? ఊడతారా ? నేతలకు సర్వేల టెన్షన్

అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసిపి ఇప్పటి వరకు తొమ్మిది జాబితాలు విడుదల చేసింది. డిసెంబర్ నుంచి మొదలుపెట్టి కొందరు సిట్టింగ్‌లను తప్పిస్తూ... ఇప్పటి వరకు 60కి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఎన్నికల షెడ్యూలు సమయం దగ్గర పడుతుండడంతో... ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై కూడా ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటోందట.

అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసిపి ఇప్పటి వరకు తొమ్మిది జాబితాలు విడుదల చేసింది. డిసెంబర్ నుంచి మొదలుపెట్టి కొందరు సిట్టింగ్‌లను తప్పిస్తూ… ఇప్పటి వరకు 60కి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఎన్నికల షెడ్యూలు సమయం దగ్గర పడుతుండడంతో… ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై కూడా ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటోందట. ఆ అభ్యర్థిపై ఏ మాత్రం తేడా ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినా…నెగెటివ్‌ టాక్‌ పెరిగినా అందుకున్న కారణాలపై ఆరా తీస్తోందట పార్టీ అధిష్టానం. లోటుపాట్లపై సమాచారం అందిన తర్వాత నిర్మొహమాటంగా పాత అభ్యర్థిని పక్కనబెట్టి కొత్త క్యాండిడేట్‌ కోసం వెదుకుతోందట. అందుకు పెద్దగా టైం తీసుకోకుండా ఆల్రెడీ లైన్‌లో ఉన్నవాళ్లని ఖరారు చేస్తోంది. అధికారికంగా అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించే దాకా ఈ మార్పులు… చేర్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్న చర్చ వైసిపి వర్గాల్లో జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ (Why not 175) , 25 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటామన్న నినాదంతో ప్రచారానికి దిగింది వైసీపీ. అందుకే ఎక్కడా తగ్గకుండా, ఎలాంటి మొహమాటాలు లేకుండా అభ్యర్థుల ఎంపిక జరుగుతోందంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఆయా నియోజకవర్గాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా వైసీపీ కూడా మార్పులకు మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగానే మంగళగిరి (Mangalagiri) లో గంజి చిరంజీవిని తప్పించి మురుగుడు లావణ్యకు ఛాన్స్ ఇచ్చింది. అటు జీడీ నెల్లూరులో నారాయణస్వామికి అవకాశం ఇచ్చిన పార్టీ…తాజాగా ఆయనను మార్చి కృపాలక్ష్మికి (Kripalakshmi) ఛాన్స్ ఇచ్చింది.

ఇక ఎమ్మిగనూరులో ముందు మాచాని వెంకటేష్‌ను ప్రకటించినా ఆ తర్వాత బుట్టా రేణుకకు లైన్‌ క్లియర్‌ చేసింది. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తారని చెప్పుకుంటున్న పిఠాపురంపై ఫోకస్‌ పెట్టిందట పార్టీ అధినాయకత్వం. అక్కడ ఇప్పటికే ఎంపీ వంగా గీతను బరిలో దింపింది. కానీ… మారిన రాజకీయ పరిణామాలతో కొత్త అభ్యర్థిని తెర మీదికి తీసుకురావడమా లేక ఆమెనే కొనసాగించడమా అన్న కసరత్తు జరుగుతోందట. ఇలా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకుంటున్న వైసీపీ పెద్దలు… అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని డిసైడయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన బెట్టిన వైసిపి… అభ్యర్థుల విషయంలో దూకుడుగా నిర్ణయం తీసుకుంటోంది. మరి ఈ ప్రయోగాలు ఎంతవరకు ఫలితం ఇస్తాయో చూడాలంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు.