AP Elections : పట్టణాల్లో ఫ్యాన్ కి ఎదురుగాలి.. జగన్ భయం అందుకేనా ?

ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో ఒకే.. కానీ పట్టణాల్లో మాత్రం ఫ్యానుకు ఎదురుగాలి వీస్తోంది. అందుకే వైసీపీ చీఫ్, సీఎం జగన్.. పట్టణ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా మర్చారు. ఏపీలో జగనన్న పథకాలతో ఎక్కువ బెనిఫిట్ పొందుతోంది గ్రామీణ ప్రాంతాల ప్రజలే. రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగట్లేదన్న ఆలోచన పట్టణ జనంలో ఉంది. అందుకే నగరాలు, పట్టణాల ఓటర్ల నుంచి వ్యతిరేకతను తట్టుకోడానికి అభ్యర్థులను మారుస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు.

వై నాట్ 175.. అంటున్న వైసీపీ అధిష్టానం.. నిజంగా అన్నంత ధీమాగా మాత్రం లేదు. గెలుస్తామని అనుకున్నప్పుడు అభ్యర్థులను మార్చడం ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. సంక్షేమ పథకాల్లో టీడీపీ కంటే మనమే బెటర్.. ప్రజలు మన వెంటే ఉంటారు కదా అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం ఊహించని పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉచిత పథకాలతో ఎక్కువగా లబ్ది పొందుతోంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళే. పట్టణాలు, నగరాల్లో ఫ్రీ స్కీమ్స్ చాలా మందికి అందడం లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఎగువ మధ్యతరగతి జనమే. వీళ్ళంతా సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు. ఏ సోషల్ మీడియాలో చూసినా.. ఏపీలోని పట్టణ, నగర ఓటర్ల మాటలు వింటే.. వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నులు, కడప, చిత్తూరు.. ఇలా ఏనగరంలో చూసినా.. వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అవుతున్న సర్వేల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వం.. ఫ్రీస్కీమ్స్ నమ్ముకొని.. అభివృద్ధిని పక్కన పెట్టేసింది. కొత్త కంపెనీలు రావట్లేదు.. నిరుద్యోగులకు ఉపాధి దొరకడం లేదన్న విమర్శలే వస్తున్నాయి. అయితే గ్రామాల్లో ఉన్న ఓటు బ్యాంకుతో ఎలాగొలా గట్టెక్కవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నా.. పరిస్థితి మాత్రం అంత ఈజీగా లేదు. పట్టణ నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులకి కూడా లోలోపల భయం పట్టుకుంది. అందుకే వైసీపీ నగరాలు, పట్టణాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. ఏపీలోని ఏడు కార్పొరేషన్లతో పాటు 17 మున్సిపాలిటీల్లో మేయర్లు, డిప్యూటీలు, వార్డు మెంబర్లకు.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను జనానికి వివరించే బాధ్యతలను అప్పగించింది. వాలంటీర్లతో పాటు పార్టీ ఇంఛార్జులు, సమన్వయకర్తలు.. నగరాలు, పట్టణాల్లో వీధి వీధి తిరుగుతున్నారు.

సంక్షేమ పథకాలే కాదు.. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి.. ఉద్యోగ, ఉపాధికి తీసుకున్న చర్యలను టౌన్స్ లో వివరిస్తున్నారు. వచ్చే రెండు, మూడు నెలల పాటు వీళ్ళంతా జనంలోనే ఉండాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించింది. పట్టణాల్లో ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోల్పోకూడదని భావిస్తోంది. మొత్తానికి అర్భన్ ఏరియాలో ఫ్యానుకు ఎదురు గాలి వీస్తుందన్న సంగతి మాత్రం వైసీపీ అర్థమైంది.