YANAMALA FAMILY : యనమల ఫ్యామిలీకి 4 టిక్కెట్లు ఇదేంటి బాబూ… ఇదెక్కడి రూల్ !

ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని టీడీపీలో ఓ రూల్ ఉంది. కానీ అది కొందరికి మాత్రం వర్తించదు అనే షరతు కూడా ఉందేమో. ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీలో బాబుతో పాటు కొడుకు లోకేష్, వియ్యంకుడు బాలకృష్ణకు టిక్కెట్లు ఇచ్చారు. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కూడా ట్రై చేశాడు. కానీ ఎందుకో రాలేదు.

ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని టీడీపీలో ఓ రూల్ ఉంది. కానీ అది కొందరికి మాత్రం వర్తించదు అనే షరతు కూడా ఉందేమో. ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీలో బాబుతో పాటు కొడుకు లోకేష్, వియ్యంకుడు బాలకృష్ణకు టిక్కెట్లు ఇచ్చారు. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి కూడా  టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు (Yanamala Ramakrishnu) కుటుంబంలో నలుగురికి టిక్కెట్లు వచ్చాయి.

టీడీపీ (TDP) లో కాస్త పలుకుబడి, బాగా డబ్బులు ఉంటే కుటుంబంలో ఎంతమందికైనా టిక్కెట్లు ఇస్తారా … మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబం గురించి టీడీపీ సీనియర్లలో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. ఆ ఇంట్లో నలుగురికి టికెట్లు ఇవ్వడమే ఇందుక్కారణం. తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరిన నేతలైతే బాబు మీద మండిపడుతున్నారు. యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు అసెంబ్లీ సీటు ఇచ్చింది టీడీపీ. యనమల అల్లుడు, అంటే సుధాకర్‌ యాదవ్‌ కొడుకు పుట్టా మహేశ్‌ యాదవ్‌కు ఏలూరు లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. ఇక యనమల కూతురు దివ్యకు తుని అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ కేటాయించింది టీడీపీ అధిష్టానం.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన కొడుకు విజయ్‌కు అనకాపల్లి లోక్‌సభ సీటు ఇవ్వమని అడిగారు. అందుకు చంద్ర బాబు, లోకేశ్‌ అంతెత్తున లేచారు… అలా ఎలా ఇస్తాం… మన పార్టీ రూల్స్ తెలియవా… అని ప్రశ్నించారు. కానీ యనమల ఫ్యామిలీ విషయంలో ఈ రూల్స్ ఎటు పోయాయి. డబ్బుంటే చాలా… వాటితో టిక్కెట్లు కొనుక్కుంటే ఏ కుటుంబానికి ఎన్నైనా ఇస్తారా… అయ్యన్నపాత్రుడు తన సన్నిహితుల దగ్గర ఇలాగే వాపోతున్నారట. ఆయనే కాదు టీడీపీ టికెట్లు దక్కని వాళ్ళంతా చంద్ర బాబును తిట్టుకుంటున్నారు. నిన్న గాక … మొన్న పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో కూడా రెండు టిక్కెట్లు ఇవ్వడమేంటని అడుతున్నారు. ఒన్ ఫ్యామిలీ ఒన్ టిక్కెట్ రూల్ ని టీడీపీ పక్కన పెట్టేసిందా అని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు.